Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భద్రతా వలయంలో ఢిల్లీ.. "హర్ ఘర్ తిరంగ"లో పాక్ పౌరురాలు

Advertiesment
India
, సోమవారం, 14 ఆగస్టు 2023 (22:04 IST)
India
మంగళవారం నాటి 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీని భద్రతా దుప్పటితో కప్పి ఉంచామని భద్రతా అధికారులు తెలిపారు. ఎర్రకోటతో పాటు పరిసర ప్రాంతాల్లో 10,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు.
 
ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని పోలీసులు తెలిపారు. 
కోట చుట్టుపక్కల, ఇతర వ్యూహాత్మక ప్రదేశాలలో ఫేస్ రికగ్నిసేషన్, వీడియో అనలిటిక్ సిస్టమ్‌లతో కూడిన 1,000 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
 
దీనిపై ఢిల్లీ పోలీసు అధికార ప్రతినిధి సుమన్ నల్వా మాట్లాడుతూ, "ఢిల్లీ పోలీసులు మొత్తం అలర్ట్‌గా ఉన్నారు. విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
 
మరోవైపు దాయాది దేశం నుంచి భారత కోడలిగా వచ్చిన పాకిస్తాన్ పౌరురాలు సీమా హైదర్, భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు నోయిడాలో తన కుటుంబంతో కలిసి భారత జెండాను ఎగురవేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సచిన్ మీనాతో కలిసి జీవించడానికి పాకిస్థాన్ నుంచి ఆమె భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.  
 
ఈ నేపథ్యంలో సీమా హైదర్ భారత జెండా పట్టుకుని వున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని వారి నివాసంలో "హర్ ఘర్ తిరంగ" వేడుకల్లో భాగంగా సీమా హైదర్, సచిన్ మీనా ఆదివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 
 
త్రివర్ణ పతాక చీర ధరించి, దేశభక్తితో కూడిన తలకట్టు ధరించి, ఆమె ''జై మాతా ది'' నినాదాలు చేస్తూ ''భారత్ మాతా కీ జై'', ''వందేమాతరం'' నినాదాలు చేయడం కూడా వీడియోలో వినబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు- పంజాబ్‌లో ఉగ్రమూకల అరెస్ట్