రిలయన్స్ జియో నుంచి చౌక 5జీ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఈ ఫోనుకు ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేట్ వచ్చిందంటూ ప్రచారం. మార్కెట్‌లోకి రెండు కొత్త హ్యాండ్ సెట్లు విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లను చౌక ధరకే విక్రయించనుంది. టెలికాం రంగంలో సంచనలం సృష్టించిన రిలయన్స్ జియో కంపెనీ మరో సంచలనానికి తెరతీయనుంది. త్వరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుందని సమాచారం.
ఈ స్మార్ట్ ఫోనును చౌక ధరకే వినియోగదారులకు అందించేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేట్ లంభించిందని ప్రచారం జరుగుతుంది. రెండు కొత్త హ్యాండ్ సెట్‌లకు సంబంధించి కంపెనీ ఉన్నత వర్గాల్లో ఇప్పటికే చర్చలు జరిగాయని, ఈ నెలాఖరులో జరగనున్న కంపెనీ వార్షిక సమావేశానికి ముందే ఈ స్మార్ట్ ఫోన్లను సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
5జీ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి జియో కంపెనీ రెండు రకాల హ్యాండ్ సెట్లను తయారు చేసింది. ఈ ఫోన్‌ల మోడల్ నంబర్‌ను జేబీవీ 161 డబ్ల్యూ 1, జేబీవీ 162 డబ్ల్యూ1, అయితే, ఇవి రెండూ 5జీ ఫోన్లనా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రిలయన్స్ జియో 5జీ ఫోన్లు అంటూ సోషల్ మీడియోలో ఇప్పటికే పలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ జియో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్‌లు...
90 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాలు హెచ్.డి.ప్లస్ స్క్రీన్
స్నాప్ డ్రాగన్ 480 చిప్ సెట్ స్పీడ్
18 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
డ్యూయల్ రియల్ కెమెరా సెటప్
13 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ సెకండీ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తుంది