ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒకటైన రియల్‌మీ మరో కొత్త స్మార్ట్ ఫోనును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొత్త హంగులతో పాటు మేలైన ఫీచర్లతో ఈ ఫోనును మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటో.. ఐఫోన్ 14 ప్రోలో ఉన్న డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ హిలియో జీ88 ప్రాసెసర్‌ను అమర్చారు. 6.72 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 90హెచ్‌జడ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ఇందులో 5,000 ఏంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 29 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుంది.
నలుపు, నీలం రెండు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. వెనక వైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్‌ను అమర్చారు. ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, అదనపు స్టోరేజ్ కోసం మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌ని కూడా ఇస్తున్నారు.
ఈ మొబైల్ రెండు వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. 4జీబీ ప్లస్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా రియల్‌మీ పేర్కొంది. ఏప్రిల్ 18 నుంచి అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్లలో వీటి విక్రయాలు ప్రారంభంకానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద బేస్ వేరియంట్‌పై రూ.700, 6జీబీ వేరియంట్‌పై రూ.1000 చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది.