బెలారస్ ఉద్యమ కారుడికి నోబెల్ శాంతి బహుమతి

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (19:29 IST)
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే వ్యక్తులు, సంస్థలకు ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని నోబెల్ కమిటీ ప్రకటించింది. ఈ యేడాది బెలారస్ దేశానికి చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు బైలియాట్ స్కీ, రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రెయిన్‌ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు ఈ శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ఉద్యమకారుడు, ఉద్యమ సంస్థలు తమ దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పట్ల అవగాహనం కల్పించడం, ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి ఇస్తామని ఈ సందర్భంగా కమిటీ వివరించింది. 
 
ఈ యేడాది శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలు నమోదు చేయడం, మావన హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడంతో ద్వారా అమోఘమైన కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. శాంతి ప్రజాస్వామ్యం నెలకొల్పడంతో పౌర సమాజం పాత్ర ప్రాముఖ్యతను వారు చెప్పారని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments