Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డిలో ఒగ్గు కథ షో ద్వారా కల్తీ చేసిన టీ పొడి పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన టాటా టీ జెమిని

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (17:29 IST)
తెలంగాణాలో సుప్రసిద్ధ టీ బ్రాండ్‌లలో ఒకటైన టాటా టీ జెమిని ఇప్పుడు రసాయన రంగులను తయారుచేస్తున్న టీల వల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన కలిగించేందుకు ఓ కార్యక్రమం ప్రారంభించింది. తెలంగాణాలో ఇటీవలి కాలంలో ఈ తరహా కల్తీ టీ విక్రయం పెరుగుతుండటం చేత, ఒగ్గు కథ షో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి జనగాం, కరీంనగర్‌, వరంగల్‌లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించింది. అవి సాధించిన విజయం అందించిన స్ఫూర్తితో సంగారెడ్డిలో ప్రత్యేకంగా ఒగ్గుకథ షో నిర్వహించింది. ఒగ్గు కళాకారులు భారీ సంఖ్యలో ప్రజలను ఆకర్షించడంతో పాటుగా కల్తీ టీ సేవించడం వల్ల కలిగే నష్టాలు, బ్రాండెడ్‌ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించారు.
 
వినియోగదారులకు కల్తీల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా ఆ రకమైన పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలను గురించి వెల్లడిస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆ క్రమంలోనే తెలుగు సంస్కృతిలో అంతర్భాగమైన ఒగ్గుకథ ద్వారా ఇప్పుడు కల్తీల పట్ల ప్రచారం చేస్తోంది. ప్రాంతీయ స్ధాయిలో ఈ బ్రాండ్‌ ఇప్పుడు ఇంటింటికీ అవగాహన కల్పించడంతో పాటుగా ‘కోల్డ్‌ వాటర్‌ టెస్ట్‌’ సైతం చేయడం ద్వారా టీ కల్తీని గుర్తించేలా తోడ్పడుతుంది. ఒక లక్ష ఇళ్లలో ఈ పరీక్షలను చేయాలని లక్ష్యంగా చేసుకోగా ఇప్పటికే తెలంగాణాలో 35వేలకు పైగా ఇళ్లలో ఈ పరీక్షలు చేశారు.
 
ఈ కార్యక్రమం గురించి టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ప్రెసిడెంట్‌- ప్యాకేజ్డ్‌ బేవరేజస్‌, ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా పునీత్‌ దాస్‌ మాట్లాడుతూ, ‘‘తెలంగాణాలో  అగ్రగామి ప్యాకేజ్డ్‌ టీ బ్రాండ్‌ టాటా టీ జెమిని. కల్తీ, లూజ్‌ టీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నాము. తెలంగాణాలో ఈ తరహా టీ ప్రభావం ప్రబలంగా ఉంది. ఈ సందేశం ప్రభావవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రాంతీయ జానపద కళారూపం ఒగ్గు కథను ఆలంబనగా చేసుకుని  గ్రామీణుల నడుమ కల్తీ టీ సేవనం వల్ల కలిగే నష్టాలను వెల్లడిస్తున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments