సినిమాల్లో రకరకాల పాత్రలు వేస్తూ జనాల్ని మెప్పిస్తూ ఎంటర్‌టైన్ చేయడం వేరు. కానీ రాజకీయాల్లో అలా అందరినీ ఎంటర్‌టైన్ చేయాలంటే సాధ్యపడదు. శత్రవులుకూడా వుంటారు. నటుగిగా చాలా కాలం గేప్ తీసుకుని ఇప్పుడిప్పుడే మరలా వెబ్‌సిరీస్, సినిమాలు చేస్తున్న ఆయన రాజకీయంగానూ మూడు పార్టీలు మారారు. ఇటీవలే ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెస్పేషనల్ మేటర్ చెప్పాడు.
నేను ఎక్కువ మొబైల్ పోన్లు వాడతాను. సినిమాలకు, రాజకీయాలకు సెపరేట్‌గా వుంటాయి. నాకు రోజూ పాన్‌లు తినే అలవాటుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా కూడా కొన్ని పాన్లు ప్యాక్ చేసుకొని వెళ్ళేవాడినని. నేను హైదరాబాద్‌కు సంగారెడ్డిమీదుగా వచ్చేవాడిని. అలవాటుగా దారిమధ్యలో ఓ పాన్ షాప్‌లో పాన్ కట్టించుకుని కారులో వెళుతుండగా కొద్దిసేపటికి ఓ మహిళ ఫోన్ చేసింది. ఇప్పుడు మీరు తీసుకున్న పాన్ తినొద్దు. అందులో విషం వుందని చెప్పింది. నేను షాక్ అయ్యాను. ఆ మహిళ ఎవరోకాదు. పాన్ కట్టించిన యజమాని భార్య. అప్పటికే రాజకీయాల్లో వుండడంతో ఇంత నీచంగా, దారుణంగా రాజకీయాలు వుంటాయని అర్థమైందని చెప్పాడు బాబూమోహన్. టిడి.పి. నుంచి బటయకు వచ్చాక ఆయన చాలా కాలం అనారోగ్యంతో బాఢపడ్డారు. ఆ తర్వాత టి.ఆర్.ఎస్. పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన బి.జెపి. తీర్థం పుచ్చుకున్నారు.