Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించే ఖోస్టా-2 వైరస్

Advertiesment
Bats
, శనివారం, 24 సెప్టెంబరు 2022 (15:18 IST)
కరోనా వైరస్ ప్రపంత గమనాన్ని ఎంతలా మార్చిందన్న సంగతి తెలిసిందే. తాజాగా సరికొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. అమెరికన్ సైంటిస్టులు వెల్లడించిన సమాచారం ప్రకారం గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందిన స్వభావం ఉన్న ఖోస్టా2 వైరస్ మీద కీలక ప్రకటన చేశారు. 
 
2020లో ఈ వైరస్‌ను రష్యా గబ్బిలాల్లో గుర్తించినట్లుగా సైంటిస్టులు పేర్కొన్నారు. మనిషి కణజాలంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఈ వైరస్.. ఒకసారి మనుషులకు వ్యాప్తిస్తే.. తీవ్రంగా వ్యాప్తి చెందటంతో పాటు.. దీని ద్వారా వచ్చే ముప్పు ఎక్కువని స్పష్టం చేస్తున్నారు. ఇది కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌గా పేర్కొంటున్నారు.
 
మనిషి కణాలకు ఇన్ఫెక్షన్ సోకించటంతో పాటు ప్రస్తుత వ్యాక్సిన్‌లకు ఈ వైరస్ నిరోధకతను కలిగి ఉంటుందన్నారు. ఖోస్టా 2 కూడా కరోనాకు చెందిన మూల కుటుంబం సార్స్ కోవ్ 2కు చెందినదే. ఒకే ఫ్యామిలీకి చెందిన ఈ కొత్త వైరస్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇందులో కూడా ఖోస్టా 1.. ఖోస్టా 2 అని రెండు ఉన్నాయని.. ఖోస్టా 1న మనుషులకు సోకదని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కథ ముగిసినట్టే.. చీకటి గుహలో వెలుగు రేఖ కనిపిస్తోంది.. డబ్ల్యూహెచ్‌వో