మళ్లీ వాయిదాపడిన నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (10:41 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేపట్టదలచిన ఆర్టెమిస్-1 ప్రయోగం మరోమారు వాయిదాపడింది. నిజానికి గత నెల 29వ తేదీనే ఈ ప్రయోగం చేపట్టాల్సింది. చివరి నిమిషలో రాకెట్‌లో ఇంధన లీకేజీ కారణంగా తొలిసారి వాయిదాడింది. దీంతో శనివారం ఈ ప్రయోగాన్ని మళ్లీ చేపట్టాలని భావించారు. కానీ, గతంలో ఉత్పన్నమైన సమస్యే తిరిగి పునరావృత్తమైంది. దీంతో ఈ ప్రయోగాన్ని వాయిదా వేసింది. 
 
గత నెల 29వ తేదీన ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్టన్టు ప్రకటించిన నాసా తిరిగి ఈ నెల 3వ తేదీ ప్రయోగించనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. శనివారం కూడా గతంలో తలెత్తిన సమస్యే తలెత్తింది. రాకెట్‌లోని మూడో నంబరు ఇంజిన్‌లో ఇంధన లీకేజీ కనిపించగా దానిని సరిదిద్దేందుకు చేపట్టిన ప్రయత్నాలు ఫలించలేదు.
 
దీంతో వరుసగా రెండో పర్యాయం కూడా ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. అయితే, ఈ ప్రయోగాన్ని తిరిగి ఎపుడు చేపట్టనున్నదీ మాత్రం నాసా శాస్త్రవేత్తలు వెల్లడించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments