Nagashaurya, Anand Devarakonda, Manasa, KV Guhan
ఆహా ఇప్పుడు మరో సరికొత్త చిత్రం హైవేతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయటానికి సిద్ధమవుతోంది. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా మానస హీరోయిన్ గా నటించిన చిత్రం హైవే. ఆగస్ట్ 19న ఆహాలో డైరెక్ట్ రిలీజ్ అవుతోన్న ఈ మూవీని కె.వి.గుహన్ తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం హీరో నాగశౌర్య విడుదల చేశారు.
అనంతరం నాగ శౌర్య మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఆవారా, ఒక రాక్షసన్ చిత్రం చూసినట్టుంది. హైవే సినిమా పేరు వినగానే పాజిటివ్ అనిపించింది. థియేటర్‌కు వెళ్లి సినిమాను చూసినా కూడా ఓటీటీలోనూ చూడాలని అనుకుంటాం. ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్ గారికి థాంక్స్. మొన్నీ మధ్య ఆహాలో ఓ సినిమాను చూశాను. అసలు ఆహా అని ఎందుకు పేరు పెట్టారా? అనుకున్నాను. ఆ సినిమా చూశాక నేను ఆహా ఏముందిరా అనుకున్నాను. అప్పుడర్థమైంది ఆహా అని ఎందుకు పేరు పెట్టారో. ఈ చిత్రం ఆగస్ట్ 19న ఆహాలో రాబోతోంది. అందరూ చూడండి. శరత్ మరార్ గారు నాకు ఎప్పుడూ అండగా ఉంటారు. మానస క్యూట్‌గా కనిపించారు. తెలుగు ఇండస్ట్రీకి స్వాగతం. కేవీ గుహన్ గారి టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. నిరంజన్ గారు లేకుండా ఏ సినిమా కూడా రిలీజ్ కాదేమో. ఇక్కడకు వచ్చిన అందరికీ థాంక్స్. నాకు లవర్ బాయ్ అని ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు. కానీ ఆనంద్ మాత్రం సంబంధం లేదని చిత్రాలు చేస్తున్నారు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం ఇలా వేరే వేరే జానర్లను చేస్తున్నారు. అది చాలా గొప్ప లక్షణం. స్క్రిప్ట్ సెలెక్షన్ అద్భుతంగా ఉంటుంది. నన్ను ఇక్కడకు పిలిచినందుకు థాంక్స్ అని అన్నారు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ చిత్రం సీటు అంచున కూర్చోబెట్టేస్తుంది. నేను ఎప్పుడూ కూడా కొత్త చిత్రాలను చేయాలని అనుకునే ఇండస్ట్రీలోకి వచ్చాను. జయాపజయాలతో నిమిత్తం లేకుండా విభిన్న జానర్‌లను ప్రయత్నించాలని అనుకున్నాను. అలాంటి సమయంలోనే కేవీ గుహన్ సర్.. వెరైటీ కథతో వచ్చారు. ఇది ప్రయోగాత్మక చిత్రం. కరోనా సమయంలో ఎన్నో నియమనిబంధనల మధ్య షూటింగ్ చేయాల్సి వచ్చింది. అతి తక్కువ మందితో షూట్ చేసి అద్భుతమైన అవుట్ పుట్ తీసుకొచ్చారు. నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన వెంకట్ సర్‌కు థాంక్స్. మిడిల్ క్లాస్ మెలోడిస్ టైం నుంచి శరత్ మరార్ నాకు ఎంతో సపోర్టివ్ ఉంటూ వచ్చారు. మనం కలిసి పని చేద్దామని అంటుంటారు. మానసతో పని చేయడం ఆనందంగా ఉంది. నేను చేసిన మూడు సినిమాల్లో కేవీ గుహన్ ఎక్స్‌పిరీయన్స్ ఉన్నవారు. ఆయన తీసిన అతడు చిత్రం నాకు ఫేవరేట్. ఆ సినిమా గురించి నేను ఆయన్ను అడుగుతుండేవాడిని. ఆయనతో పని చేయడం నాకు ఆనందంగా ఉంది. మళ్లీ మళ్లీ ఆయనతో పని చేయాలని అనుకుంటున్నాను. పాతాళ్ లోక్‌లో అభిషేక్ అద్భుతంగా నటించారు. ఇందులో అందరూ చక్కగా నటించారు. ఆహాలో ఈ చిత్రం ఆగస్ట్ 19న రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.
కేవీ గుహన్ మాట్లాడుతూ.. వెంకట్ తలారి గారికి థాంక్స్. శరత్ సర్ మా వెన్నంటే ఉండి అండగా నిలబడ్డారు. ఇక్కడకు వచ్చినందకు నాగ శౌర్యకు థాంక్స్. ఆనంద్ దేవరకొండకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పాలి. కరోనా తరువాత కంటెంట్‌లో మార్పులు వచ్చాయి. ప్రేక్షకుల అభిరుచి మారింది. ఓటీటీ వల్ల కొత్త జానర్లను ట్రై చేసేందుకు అవకాశం వచ్చింది. ఇలాంటి కథ చెప్పినప్పుడు ఆనంద్ ఓకే చెప్పారు. రెగ్యులర్ హీరోయిక్ సినిమాల్లా ఉండదు. ఓ పాత్రలా ఉంటుంది. ఆయన అంగీకరించారు. అందుకే ఆయనకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పాలి. పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ నాకు చాలా ఇష్టం. అందుకే అభిషేక్‌ను ఈ చిత్రంలో తీసుకున్నాను. అభిషేక్ కూడా ఓ సౌత్ సినిమాను చేయాలని చూస్తున్న సమయంలో ఈ కథ చెప్పాను. ఆయన ఓకే అన్నారు. ఓ అమాయకత్వం ఉన్న అమ్మాయి కోసం వెతికాను. మానసలో ఆ ఇన్నోసెన్స్ కనిపించింది. ఈ చిత్రం కోసం పని చేసిన అందరూ కూడా త్వరలోనే మరింత స్థాయికి వెళ్తారు. సైమన్ ఈ పాటలతో ఊపిరి ఇచ్చారు. ఎడిటర్ తమ్మరాజు, నిరంజన్ గారికి థాంక్స్. సరైన సినిమా వచ్చినప్పుడు దానికి ఓ ఫ్లాట్ ఫాం కావాలి. ఇలా ఆహా మా సినిమాను తీసుకుంది. మా సినిమాను తెలుగు వారంతా చూసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. నన్ను ట్రైలర్ లాంచ్‌కు పిలిచినందుకు థాంక్స్. ఈ సినిమా కోసం మొదటి నుంచి నేను ఉన్నాను. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుంది. అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం. దానికి కారణం కేవీ గుహన్. ఆయన అద్భుతమైన కెమెరామెన్ అని అందరికీ తెలిసిందే. ఆయన ఈ చిత్రానికి అద్భుతమైన కథ రాసి, దర్శకత్వం వహించారు. షూటింగ్‌ను వర్షంలోనూ అద్భుతంగా షూట్ చేశారు. పొగమంచు ఉన్నా కూడా షూటింగ్ చేస్తుండేవారు. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది అన్నారు.
హీరోయిన్ మానస మాట్లాడుతూ.. నాకు తెలుగులో ఇది మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్ సర్‌కు థాంక్స్. నన్ను ఓ ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. తులసి పాత్రను నాకు ఇచ్చినందుకు గుహన్ సర్‌కు థాంక్స్. మా హీరో ఆనంద్ దేవరకొండకు థాంక్స్. ఆయన ఎంతో మంచి వ్యక్తి. మా ట్రైలర్ లాంచ్‌కు వచ్చిన హీరో నాగ శౌర్యకు థాంక్స్. ఆగస్ట్ 19న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.