Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం.. 13ఏళ్ల జైలు, 12 కొరడా దెబ్బలు

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (18:32 IST)
12 ఏళ్ల మైనర్ బాలికపై ఓ షాపింగ్ మాల్‌లో పనిచేసే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్వీట్లు, చాక్లెట్లు ఇచ్చి ఆ చిన్నారితో పరిచయం ఏర్పరుచుకున్న ఆ కామాంధుడు ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సింగపూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సింగపూర్ మినిమార్ట్ అనే షాపింగ్ మాల్‌లో పనిచేసే ఉదయ్ కుమార్ అనే 31ఏళ్ల వ్యక్తి.. షాపింగ్ మాల్‌కు వచ్చే చిన్నారితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ చిన్నారితో రోజూ గడిపేవాడు. గదికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. 
 
కానీ ఉదయ్ కుమార్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ వుండేది. ఆమెను గత మూడు నెలలుగా పట్టించుకోకపోవడంతో.. ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో అతడి మొబైల్ ఫోన్‌ను చెక్ చేసింది. అంతే అందులో 12 ఏళ్ల మైనర్ నగ్న చిత్రాలు వుండటం, వాళ్లిద్దరూ సన్నిహితంగా వున్న ఫోటోలు వుండటంతో షాక్ అయ్యింది. దీంతో మైనర్ బాలికతో శారీరక సంబంధాన్ని కలిగి వుండిన బాయ్‌ఫ్రెండ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. విచారణలో అతడు దోషిగా తేలడంతో.. 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాకుండా తాను చేసిన తప్పు విలువ తెలిసేలా 12 కొరడా దెబ్బలు కొట్టాలని కూడా తీర్పు వెలువరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం