Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హంపీకి అరుదైన స్థానం.. ఏంటది?

హంపీకి అరుదైన స్థానం.. ఏంటది?
, శుక్రవారం, 11 జనవరి 2019 (11:16 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపీ నగరానికి అరుదైన గుర్తింపు, స్థానం లభించింది. ప్రపంచంలో ఉన్న చూడచక్కని స్థలలు, చూడాల్సిన స్థలాల్లో హంపీకి రెండోస్థానం వరించింది. ముఖ్యంగా, జీవితకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రాంతంగా హంపీ గుర్తింపుపొందింది. ఈ మేరకు ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక తాజా మ్యాగజైన్‌లో వెల్లడించింది. 
 
ఈ జాబితాలో పలు దేశాలకు చెందిన 52 పర్యాటక ప్రాంతాలు ఉండగా, హంపీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో భారత్ నుంచి హంపీ ఒక్కటే ఎంపిక కావడం గమనార్హం. 
 
కాగా, హంపీ నగరం తుంగభద్ర నదీ తీరంలో 26 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఈ చారిత్రక ప్రదేశం. ఇప్పటికీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విదేశీయులు కూడా ప్రశంసలు కురిపించారు. 2016-17 సంవత్సరంలో 5.35 లక్షల మంది హంపీని సందర్శించారు. వీరిలో 38 వేల మంది విదేశీ పర్యాటకులే ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇచ్ఛాపురం నుంచి ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలుసా?