Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాలో కూలిన హెలికాఫ్టర్ - 8 మంది గల్లంతు

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (11:37 IST)
రష్యాలో గురువారం తెల్లవారుజామున విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. కొంతమంది పర్యాటకులతో వెళ్తున్న ఎంఐ-8 హెలికాప్టర్‌ ఉన్నట్టుండి కూలిపోయింది. తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలోని కురిల్ సరస్సులో హెలికాప్టర్‌ కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 13 మంది ప్రయాణీకులతోపాటు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. 
 
వీరిలో తొమ్మిది మందిని రక్షించినట్టు అధికారులు ప్రకటించారు. మరో 8 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రక్షక దళాలు గాలిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. 
 
కాగా, ఈ హెలికాఫ్టర్ సెయింట్ పీటర్స్‌బర్గ్ నుండి అగ్నిపర్వతం సైట్ సీయింగ్‌కు పర్యాటకులను తీసుకువెళుతోందని స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఆర్‌ఐఏ నివేదించింది. ముగ్గురు సిబ్బందితోపాటు స్థానిక పర్యాటకులు ఇందులో ప్రయాణిస్తున్నారన్నారు. రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు కొనసాగుతోందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments