Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింధ్ నదిలో భారీ వరదలు.. వెండి నాణేలు దొరుకుతున్నాయ్..!

Advertiesment
సింధ్ నదిలో భారీ వరదలు.. వెండి నాణేలు దొరుకుతున్నాయ్..!
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (10:35 IST)
silver coins
భారీ వర్షాల కారణంగా నదులు నిండుతున్నాయి. వాగులు పొంగిపోతున్నాయి. అలాగే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వరద నీటిలో పురాతన నాణేలు కొట్టుకొచ్చాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో చోటుచేసుకుంది.

భారీ వర్షాల కారణంగా సింధ్ నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో నది ఒడ్డు కోతకు గురైంది. అప్పటివరకూ నదిలో ఉన్న వెండి నాణేలు నీటిలో కదులుతూ శివపురి జిల్లా అశోక్‌నగర్‌లోని పంచవళి గ్రామంలో ఒడ్డుకు రావడం మొదలైంది.
 
కొన్ని రోజులుగా పెరిగిన నీరు ఆదివారం తగ్గింది. నీరు తగ్గడంతో ఎండకు నది ఒడ్డున ఇసుకలో ఉన్న నాణేలు మెరుస్తుండటంతో స్థానికులు గమనించి నాణేలు తీసుకెళ్లారు. విషయం ఆ గ్రామం మొత్తం తెలియడంతో గ్రామ ప్రజలు అక్కడ వాలిపోయారు. నదిని జల్లెడపట్టారు. నాది నాది అంటూ ఆ నాణేలను పోటీపడి మరీ ఏరుకుంటున్నారు.
 
ఇక మధ్యప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు 400 గ్రామాలూ పూర్తిగా నీటమునిగాయి. 600 ఇళ్లు దెబ్బతిన్నాయి. 1200 మంది ఇళ్లు కోల్పోయారు. ఇలాంటి విషాద పరిస్థితుల మధ్య వారికి ఈ నాణేలు లభించాయి.

ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం నదిలో నీరు చాలా ఎక్కువే ఉంది. కానీ కొన్ని నాణేలు ఇసుకలో దొరికే సరికి నది నీటిలో మరిన్ని కాయిన్లు దొరుకుతాయి అనే ఉద్దేశంతో చాలా మంది నదిలో దిగుతున్నారు.
 
ఇక ఈ నాణేలపై బ్రిటిష్ రాణి విక్టోరియా బొమ్మలున్నాయి. అంటే ఇది 1840లో ఈస్ట్ ఇండియా కంపెనీ వీటిని ముద్రించినట్లు తెలుస్తుంది. ఇక విషయం పోలీసులకు తెలియడంతో ఆ ప్రాంతంలో భద్రత ఏర్పాటు చేశారు. నాణేలు దొరికిన వారి నుంచి సేకరించే పనిలో పడ్డారు అధికారులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశవ్యాప్తంగా భారీగా పసిడి తగ్గిన ధరలు