లాక్‌డౌన్‌ను పెంచే దిశగా ఫ్రాన్స్‌

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (18:01 IST)
యూరప్‌, అమెరికా దేశాల్లో కరోనా మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ దేశంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఫ్రాన్స్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఈ నెల 15 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగించాలని యోచిస్తోంది.

మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ పొడిగిస్తే వచ్చే ఇబ్బందులు తదితర అంశాలపై అధికారులు చర్చలు జరిపారు. పబ్లిక్‌ సేఫ్టీ, స్టే ఎట్‌ హోమ్‌ నిర్ణయం వల్ల ఎకానమిపై పడిన ఇంపాక్ట్‌ను ఎలా కవర్‌‌ చేయాలనే విషయంపై కూడా చర్చిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లో వ్యాపించిన ఈ వ్యాధి ఆంక్షలు సడలిస్తే ఇంకా విజృంభిస్తుందని వైద్య నిపుణులు సూచించారని అన్నారు.

యూరప్‌లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్‌ కూడా ఒకటి. ఫ్రాన్స్‌లో వైరస్‌ బారిన పడి ఇప్పటికే వెయ్యి మంది చనిపోయారు. లాక్‌డౌన్‌ కొనసాగించే అంశంపై ప్రెసిడెంట్‌ ఇమాన్యుయల్‌ మాక్రన్‌ వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పారు.

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం సోషల్‌ డిస్టెంసింగ్‌ మాత్రమే అని, దాన్ని పాటిస్తే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వైద్య సిబ్బంది సూచించారు.

యూరప్‌ దేశాల్లో కరోనా విపరీతంగా వ్యాపించింది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా కరోనా బారిన పడి ఐసీయూలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments