Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాక్‌డౌన్‌ పొడిగించండి: కేంద్రానికి టీడీపీ విజ్ఞప్తి

లాక్‌డౌన్‌ పొడిగించండి: కేంద్రానికి టీడీపీ విజ్ఞప్తి
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (18:50 IST)
లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్రానికి టీడీపీ పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది. కొద్ది సేపటి క్రితం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని దుయ్యబట్టారు.

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాలని, కూలీలు, పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.5 వేలు ఇవ్వాలని కేంద్రం చెబుతున్నా అరకొర సాయంతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు.

మెడ్‌టెక్‌ జోన్‌ ఫలితం దేశమంతా ఉపయోగపడుతోందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందుచూపును టీడీపీ పొలిట్‌బ్యూరో  అభినందించింది. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, కరోనా వైద్యసేవలు అందిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని కాల్వ శ్రీనివాసులు కోరారు.

రైతుల కరెంట్‌, నీటి బిల్లులను రద్దు చేయాలని, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని, అందరికీ ఉచితంగా కరోనా టెస్ట్‌లు చేయాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ వేళ ప్రభుత్వంపై విమర్శలు తగదు: పవన్ కళ్యాణ్