Publish Date: Fri, 10 Apr 2020 (07:59 IST)
Updated Date: Fri, 10 Apr 2020 (08:02 IST)
లాక్ డౌన్ తరువాత దుస్తుల విక్రయాలపై భారీ రాయితీలు ప్రకటించే అవకాశముందా?.. దీనిపై వ్యాపారులు సమాలోచనలు చేస్తున్నారా?.. అవుననే అంటున్నాయి వస్త్ర పరిశ్రమ వర్గాలు.
లాక్‌డౌన తర్వాత వినియోగదారులను ఆకర్షించేందుకు వస్త్ర వ్యాపారులు భారీ డిస్కాంట్లు ప్రకటించే అవకాశముంది. పాత సరకును క్లియర్ చేయడం సహా అమ్మకాల్లో వేగం పెంచేందుకు వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
దేశంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వస్త్ర వ్యాపారులు భారీగా డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత సరకును క్లియర్ చేయడం సహా వినియోగదారులను ఆకర్షించేందుకు వ్యాపారులు ప్రయత్నించవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్త్ర వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది. దుకాణాలన్నీ మూతపడ్డాయి. ఫలితంగా వేసవి ప్రత్యేక దుస్తుల ఆర్డర్లను రద్దు చేశారు వ్యాపారులు. ఈ అమ్ముడుపోని పాత స్టాకును తక్కువ ధరలకు అమ్మే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.