Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగనంలో కలకలం సృష్టించిన ప్రయాణికుడు.. అత్యవసరంగా ల్యాండింగ్

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (12:37 IST)
గగనతలంలో ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. దీంతో ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాన్ని కూల్చేస్తాన‌ని ప్ర‌యాణికుల‌ను బెదిరించడంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుంచి అట్లాంటాకు డెల్టా ఎయిర్‌లైన్ విమానం 1730 బయలుదేరి. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత తర్వాత ఓ ప్రయాణికుడు హ‌ల్‌చ‌ల్ చేశాడు. సాటి ప్రయాణికుడితో గొడవకు రెచ్చిపోయాడు.
 
దీంతో విమాన‌ సిబ్బందికి తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆ వ్య‌క్తి విమాన సిబ్బంది మాట‌ను కూడా విన‌కుండా మ‌రింత చెల‌రేగిపోయాడు.  విమానాన్ని కూల్చేస్తాన‌ని ప్ర‌యాణికుల‌ను బెదిరించాడు. 
 
విమాన సిబ్బంది ఎంత స‌ముదాయించినా విన‌కుండా త‌న గొడ‌వ‌ను కొన‌సాగించాడు. ఇద్ద‌రు విమాన సిబ్బందిని కొట్టాడు. దీంతో అత‌డిని ప‌ట్టుకుని అత‌డి సీటుకే క‌ట్టేసిన విమాన సిబ్బంది పైలట్‌కు ఈ స‌మాచారం అందించారు.
 
దీంతో విమానాన్ని చివ‌ర‌కు ఓక్లహోమా సిటీలో దించారు. ఆ ప్ర‌యాణికుడిని ఎయిర్‌పోర్ట్ పోలీసుల‌కు విమాన సిబ్బంది అప్ప‌గించారు. ఆ నిందితుడు డెల్టా ఎయిర్‌లైన్ మాజీ ఉద్యోగి అని పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ కొన‌సాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments