కరోనావైరస్. గత ఏడాది కరోనావైరస్ అంటే దాదాపు అంతా హడలిపోయారు. కానీ 2021 సంవత్సరంలో కరోనా అంటే జనం అస్సలు భయపడటంలేదు. ఒకవైపు అనేక మంది ప్రాణాలు నిలువునా కోల్పోతున్నా సరే మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు చాలామంది. ఇక కరోనా పరీక్షలు చేయించుకునేందుకు చాలామంది హడలిపోతున్నారు. తాజాగా ఒరిస్సాలో ఇలాంటిదే జరిగింది.
బుధవారం నాడు సిల్చార్ విమానాశ్రయంలో మొత్తం 690 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ కరోనా టెస్టులు చేస్తున్న క్రమంలో కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కరోనా టెస్టుకి రూ. 500 ఎందుకు కట్టాలంటూ ప్రశ్నించారు.
మరికొందరైతే టెస్టు చేశాక రిపోర్టులో తేడా వస్తే క్వారెంటైన్ విధిస్తారన్న భయంతో తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవంటూ 300 మంది ప్రయాణికులు తప్పించుకుని పారిపోయారు. ఐతే అలా పారిపోయిన ప్రయాణికుల డేటా తమ వద్ద వుందని, వారిని పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసకుంటామని పోలీసులు తెలిపారు.