పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో 30మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి - దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్లట్ ఎక్స్‌ప్రెస్, సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. అయితే, పట్టాలు తప్పిన సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలును.. మిల్లట్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో 30 మంది మృతి చెందారని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి జిల్లాలో పోలీసు అధికారి ఉస్మాన్ అబ్దుల్లా చెప్పారు. గాయపడ్డ వారిని దవాఖానాలకు తరలించారు. రెండు రైళ్ల బోగీల్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకున్నారని పేర్కొన్నారు.
సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం తర్వాత ఆ రూట్‌లో నడిచే రైళ్లను నిలిపి వేసినట్లు అబ్దుల్లా చెప్పారు.