Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా వ్యోమగామి అన్నాడు.. భూమికి రాగానే పెళ్లి అన్నాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (09:12 IST)
అంతర్జాతీయ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)లో వున్నానని ఓ వ్యక్తి జపాన్‌లోని ఓ వృద్ధ మహిళకు టోకరా వేశాడు. రష్యా వ్యోమగామినని.. భూమికి తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటానంటూ మహిళను నమ్మించి ఆమె నుంచి రూ.24.8 లక్షల వరకు కాజేశాడు. 
 
సదరు మహిళ జపాన్‌లోని షిగా రాష్ట్రంలో నివసిస్తోంది. గత జూన్‌లో ఆ నకిలీ వ్యోమగామి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. స్పేస్ సూట్ ధరించి ఉన్న అతడి ఫొటోలు చూసిన ఆ వృద్ధురాలు అతడు నిజంగానే వ్యోమగామి అని భావించింది. అక్కడ నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 
 
'లైన్' అనే జపాన్ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశాలు పంపుకునేవారు. కొన్ని రోజుల తర్వాత లవ్ ప్రపోజల్ చేశాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. జపాన్‌లో ఆమెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని ఉందంటూ ఆమెను ఉచ్చులోకి లాగాడు. 
 
అయితే, ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగి రావాలంటే రాకెట్ ఫీజు కోసం డబ్బు కావాలని ఆ మోసగాడు మహిళకు సందేశం పంపాడు. అది నిజమేనని నమ్మిన ఆ వృద్ధ మహిళ ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 5 మధ్యలో పలు దఫాలుగా డబ్బు పంపించింది.
 
కానీ మళ్లీ మళ్లీ డబ్బు కావాలని అడగటంతో అనుమానం వచ్చింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడు నకిలీ వ్యోమగామి అని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments