ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఏదైనా ఆర్డర్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ విధంగానే ఓ మహిళ వాచ్ ఆర్డర్ చేశాడు. తీరా ఇంటికి పార్శిల్ వచ్చాక.. దాన్ని చూసి షాకైంది. ఇలా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా కాసెండా గ్రామానికి చెందిన నీలం యాదవ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన రూ. 1304 విలువ చేసే ఓ వాచ్‌ను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఆర్డర్ పెట్టింది.
సరిగ్గా తొమ్మిది రోజులు.. అనగా అక్టోబర్ 7వ తేదీన ఆ ఆర్డర్ ఇంటికొచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాచ్‌కు బదులు పిడకలు వచ్చాయి. వాటిని చూసి నీలం యాదవ్, ఆమె సోదరుడు రవీంద్ర షాకయ్యారు.
ఆ తర్వాత ఇద్దరూ తేరుకుని.. డెలివరీ బాయ్‌ను చేజ్ చేసి పట్టుకోగా.. అతడు డబ్బును తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఆ పిడకలను తిరిగి తీసుకున్నాడు. ఇలాంటివి కొత్తేమీకాదు.