అమెరికా శాస్త్రవేత్తలకు వైద్యరంగంలో నోబెల్

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (20:28 IST)
ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తుల ప్ర‌క‌ట‌న ప్ర‌క్రియ సోమ‌వారం ప్రారంభ‌మైంది. తొలి రోజు వైద్య విభాగంలో అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ జులియ‌స్‌, ఆర్డెమ్ పాటాపౌటియ‌న్‌లకు నోబెల్ అవార్డులు వరించాయి. విజేత‌ల‌ను నోబెల్ క‌మిటీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ థామ‌స్ పెర్ల్‌మాన్ ప్ర‌క‌టించారు. 
 
ఉష్ణోగ్ర‌త‌, స్ప‌ర్శ‌కు సంబంధించి గ్రాహ‌కాల‌ను క‌నుగొన్నందుకుగాను వీళ్ల‌ను నోబెల్ వ‌రించింది. మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంతో మ‌నం ఎలా ఉంటున్నామ‌న్న‌దానితోపాటు మ‌న మ‌నుగ‌డకు ఉష్ణం, చ‌ల్ల‌ద‌నం, స్ప‌ర్శ‌ను గుర్తించే మ‌న సామ‌ర్థ్యం కీల‌కం. 
 
మ‌న నిత్య జీవితంలో వీటిని మ‌నం తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఉష్ణోగ్ర‌త‌, పీడ‌నాన్ని గ్ర‌హించ‌డానికి మ‌న న‌రాల ప్రేర‌ణ‌లు ఎలా ఉంటాయి? ఈ ప్ర‌శ్న‌కు ప‌రిష్కారాన్ని ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌లు చూపించారు అని నోబెల్ జ్యూరీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.
 
కాగా, జులియ‌స్ శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివ‌ర్సిటీ ఆప్ కాలిఫోర్నియా ప్రొఫెస‌ర్ కాగా.. ఆర్డెమ్ కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ప్రొఫెస‌ర్‌గా ఉన్నారు. ఇప్పుడీ ఇద్ద‌రికీ నోబెల్ బ‌హుమ‌తితో వ‌చ్చే 11 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను స‌మానంగా పంచుతారు. గ‌తేడాది మెడిసిన్‌లో నోబెల్ ముగ్గురిని వ‌రించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments