Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమాలు రావాలంటే దర్శకులు, నిర్మాతలే ముఖ్యంః ఇదే మా కథ- ప్రీ రిలీజ్లో శ్రీకాంత్

సినిమాలు రావాలంటే దర్శకులు, నిర్మాతలే ముఖ్యంః ఇదే మా కథ-  ప్రీ రిలీజ్లో  శ్రీకాంత్
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (15:47 IST)
Ide maa katha prerelease
సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గురు పవన్‌ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో ఎంఎస్ రాజు, బీ గోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్‌లు ఈవెంట్‌లో పాల్గొన్నారు.
 
దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ, పదేళ్లలో ఎన్నో చిత్రాలకు కో డైరెక్టర్‌గా పని చేశాను. నిర్మాత మహేష్ రూపంలో నాకు ఈ అవకాశం వచ్చింది. రకరకాల కథలు మనం రాస్తుంటాం. కానీ మనం మొదటిసారి వస్తున్నప్పుడు సాలిడ్‌గా రావాలి. లేదంటే మళ్లీ అలానే వెనక్కి వెళ్లిపోతాం. వంద శాతం మన లక్ష్యాన్ని చేరుకోవాలి అని ఈ కథను రాశాను. అందుకే ఈ రైడింగ్ జానర్ ఎంచుకున్నాను. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్న సమయంలో కొత్త ప్రపంచానికి వెళ్లాను. ఎంతో మంది  కొత్త రచయితలను చూశాను. అలా అందరిలోంచి కొన్ని పాయింట్లను తీసుకుని రాయడంతో ఇదే మా కథ రెడీ అయింది. ఈ కథను నేను ముందుగా ఫీలవ్వాలని, ఆ తరువాతే మిగతా వాళ్లకు చెప్పాలని అనుకున్నాను. అందుకే ఐదు వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఈ కథను రాశాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను. 
 
శృంగేరీ, హంపీ, గోకర్ణ అంటూ ఇలా తిరిగాను. కథ రాశాను. ఆ కథను నిర్మాత మహేష్‌కు చెప్పాను. ఈ కథను అందరికీ చెప్పాలనే ఆశ అందరికంటే ఆయనకే ఎక్కువగా ఉండేది. ఈ సినిమాను ఎలాగైనా సరే థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 2న మా సినిమా రాబోతోంది. అక్టోబర్ 2న భారత దేశం ఎంత స్వచ్చంగా ఉంటుందో.. ఇదే మా కథ కూడా అంతే స్వచ్చంగా ఉంటుంది. ఈ సినిమాలో ఏదో  ఉంది.. చేద్దామని ముందుకు వచ్చిన శ్రీకాంత్, భూమిక, సుమంత్, తాన్యా అందరికీ థ్యాంక్స్. ఎంఎస్ రాజు గారు కూడా కథ విన్నారు. ఒక్క చిన్న పాయింట్‌లో కూడా ఎందుకు ప్రశ్న వేయలేదు. నన్ను ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అతిథిగా వచ్చిన బీ గోపాల్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.
 
ఎంఎస్ రాజు మాట్లాడుతూ, నిర్మాత మహేష్ గారే మొదటి హీరో. అందరినీ ఒప్పించి ఈ చిత్రంలోకి తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గురు ఇంకో హీరో. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎమోషన్ అయ్యేట్టు చేసిన సినిమా ఇదే. శ్రీకాంత్, భూమిక ,సుమంత్, తాన్యలు అంత అద్భుతంగా నటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
దర్శకుడు బీ గోపాల్ మాట్లాడుతూ, నాకు బాగా ఇష్టమైన నిర్మాత ఎంఎస్ రాజు. దేవీ, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం ఇలా ఎన్నో అద్భుతైన సినిమాలు తీశారు. ఆయన కుమారుడు సుమంత్ ఎన్నో మంచి చిత్రాలు చేశారు. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  ఈ చిత్రానికి పని చేసిన అందరికీ కంగ్రాట్స్. సినిమాను తీయడం ఒకెత్తు. కొత్త దర్శకుడుని మహష్ పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.
 
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం నాకు ఎంతో స్పెషల్. సౌత్ నుంచి నార్త్ వరకు అంతా చూపించాం. మన దేశం ఎంతో అందమైందని నాకు తెలిసింది. ఇండియన్ అవ్వడం నాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది. ఈ జర్నీని నాకెంతో ఇష్టమైన శ్రీకాంత్, భూమిక గారితో పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో ఉన్న ఎక్స్ పీరియన్స్ గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవు. ఎంతో సీనియర్ అయినా కూడా ఓ బ్రదర్‌లా ఉండేవారు. ఎన్నో సలహాలు ఇచ్చేవారు. నేను ఇందులో బాగా చేశాను అని ఎవరైనా అంటే.. అది శ్రీకాంత్ గారి వల్లే. నా స్పీచ్‌ను మా నాన్న కొట్టేశారు. ఈ చిత్రానికి టెక్నికల్ యూనిట్ అంతా ఎంతో కష్టపడింది. కథను నమ్మి, ఎంతో ధైర్యంతో మహేష్ గారు చిత్రాన్ని తీశారు. అక్టోబర్ 2న మా సినిమా రాబోతోంది’ అని అన్నారు.
 
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోయింది. బడ్జెట్ అసలు కంట్రోల్ అవ్వడం లేదు. ఆ కథే అలా కోరుకుంది.  సినిమా మీద ప్యాషన్ ఉంది కాబట్టే.. ఈ రోజు మహేష్ లాంటి నిర్మాత ఈ సినిమాను తీశారు. ఇలాంటి సినిమాలు రావాలంటే దర్శకులు, నిర్మాతలే ముఖ్యం. ప్రతీ చిన్న పాయింట్ కూడా వర్కవుట్ చేసుకున్నాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సినిమా చూశాం. ఎంతో  అద్భుతంగా ఉంది. నేను తోటీ హీరోలతో సినిమాలు చేశాను. కానీ యంగ్ హీరోతో పని చేయడం ఇదే మొదటిసారి. సుమంత్‌ను చూస్తే  నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. లఢఖ్‌లో వాటర్‌లో జంప్ చేసి యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. అంత చలిలో అలా చేయడం చూసి నాకు భయమేసింది. ఎంతో కష్టపడుతున్నాడు.. ఎంతో భవిష్యత్తు ఉంది. డైలాగ్ డెలివరీ, మెమోరీ ఉన్న నటుడు. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. కచ్చితంగా సుమంత్‌కు పేరు వస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లోకి రాబోతోంది. అందరూ థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"మా" ఎన్నికలు : పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేష్