Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త విద్యా విధానం బాగుంది .. నేను రోబోను కాదు : ఖుష్బూ

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (15:16 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. నూతన జాతీయ విద్యా విధానం 2020కి కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ విద్యావిధానాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అలాగే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా స్వాగతించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె వివరణ ఇచ్చారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
 
'నూతన విద్యా విధానంపై పార్టీ విధానంతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఇందుకు రాహుల్ గాంధీ గారూ... నన్ను క్షమించాలి. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. నేను రోబోను కాను. కీలు బొమ్మను అసలే కాను. ప్రతి విషయంలోనూ అధిష్టానానికి తలూపాల్సిన పని లేదు. ఓ సాధారణ పౌరురాలిగా మన వైఖరి చాలా ధైర్యంతో చెప్పాలి' అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments