మెగాస్టార్ చిరంజీవి నటించనున్న తాజా చిత్రం 'లూసిఫర్'. కొరటాల శివ నిర్మించే "ఆచార్య" చిత్రం తర్వాత లూసిఫర్ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు.
అయితే, ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా (లూసిఫర్ ఒరిజినల్‌లో మోహన్‌లాల్ సోదరిగా మంజు వారియర్ నటించారు) అంటూ ఇప్పటికే విజయశాంతి, సుహాసినిల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు కొత్తగా చిరంజీవి సోదరిగా ఖుష్భూ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అలాగే ఖుష్భూ రెండో భర్తగా (మంజు వారియర్ రెండో భర్తగా చేసిన వివేక్ ఒబెరాయ్ పాత్రలో) జగపతిబాబును అనుకుంటున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలైనా నిజమో లేదంటే.. మళ్లీ రెండు రోజులకి మరో రెండు పేర్లు వినిపిస్తాయో? ఏదిఏమైనా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఇలాంటి వార్తలు మాత్రం ఆగవు.
ఇక ఈ సినిమాలో మంజు వారియర్ పాత్ర చాలా టిపికల్‌గా ఉంటుంది. నిజంగా ఖుష్భూ ఈ పాత్ర చేస్తే.. పాత్రకే నిండుతనం వస్తుంది. తెలుగులో ఆమె పాత్రకు ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే వివేక్ ఒబెరాయ్ పాత్ర చాలా కన్నింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రకు జగ్గూభాయ్ పర్‌ఫెక్ట్‌గా సరిపోతారు. మరి అఫీషియల్‌గా ఈ పాత్రల్లో ఎవరు నటించనున్నారో తెలియాలంటే మాత్రం చిత్రయూనిట్ స్పందించాల్సివుంటుంది.