Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త కోసం తమ్ముడిని హత్య చేయబోయింది, కటకటాల పాలైంది

Advertiesment
భర్త కోసం తమ్ముడిని హత్య చేయబోయింది, కటకటాల పాలైంది
, గురువారం, 4 జూన్ 2020 (18:42 IST)
నేరస్తుడైన భర్తను జైలు నుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నించి ఆమె కూడా చివరికి అక్కడికే చేరింది. భర్తను విడిపించడానికి ఖర్చులు కోసం డబ్బు కొరవవడంతో తమ్ముడి సహాయం కోరింది. ఆస్తి అమ్మి తనకు డబ్బు సమకూర్చాల్సిందిగా ఒత్తిడి తెచ్చింది. కానీ తమ్ముడు నిరాకరించడంతో మనసులో పగను పెంచుకుంది. బెంగుళూరులో యలహంక ప్రాంతంలోని బీబీరోడ్డులో నివాసముంటున్న సందీప్ రెడ్డి, సుమలత అక్కాతమ్ముళ్లు.
 
సుమలత భర్త ఏదో కేసులో జైలుపాలై శిక్ష అనుభవిస్తున్నాడు. బావను బయటకు తీసుకువచ్చేందుకు ఆస్తి అమ్మి డబ్బు ఇవ్వమని తమ్ముడిని కోరింది. నిరాకరించిన తమ్ముడిపై ద్వేషంతో రగిలిపోయింది. ఎలాగైనా చంపి ఆస్తి సొంతం చేసుకోవాలని పథకం రచించింది. కిరాయి రౌడీలను ఏర్పాటు చేసి హతమార్చడానికి ప్రయత్నించింది.
 
కిరాయి రౌడీలు ప్లాన్ వేసి రాత్రి పూట సందీప్ రెడ్డిపై దాడి చేసారు. రక్తం చిందేలా దారుణంగా కొట్టి చనిపోయాడనుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు. కానీ ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన సందీప్ రెడ్డి పోలీసులకు ఫీర్యాదు చేసాడు. వారు విచారణ జరిపి నిజమేనని తేల్చడంతో ఆమెతో సహా నలుగురు కిరాయి ముఠా సభ్యులు మంజు, గౌతమ్, వినాయక్, మౌలాలి ఖాన్‌ను జైలులో వేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధికారులు ఉండేది కాఫీలు - టిఫెన్లు మోయడానికా? మాజీ మంత్రి ఆనం ప్రశ్న