Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చి పీక్స్‌కు.. ఇళ్ళు కాళుతుంటే భార్యాభర్తల సెల్ఫీ... ఎక్కడ..?

సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీ మొబైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి యువకులు ఎక్కువగా ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (09:01 IST)
సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీ మొబైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి యువకులు ఎక్కువగా ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం జరిగినా సరే సెల్ఫీ తీసుకోవడం మాత్రం జనం మానడం లేదు. కొంతమందైతే విచిత్ర దోరణిలో ప్రవర్తిస్తున్నారు. వారి సెల్ఫీ పిచ్చి కాస్త పీక్స్‌కు చేరిందనే చెప్పొచ్చు. అలాంటి ఘటనే దక్షిణ చైనాలో జరిగింది.
 
దక్షిణ చైనాలోని గుయోలిన్ ప్రాంతానికి చెందిన నమయూన్, కార్తాలు తమ ఇళ్ళు కాలిపోతుంటే సెల్ఫీ దిగారు. ప్రమాదవశాత్తు షార్ట్ షర్క్యూట్ అయి ఇళ్ళు తగలబడింది. ఇళ్ళు కాలుతున్న సమయంలో నమయూన్ బాత్ రూంలో ఉన్నాడు. కార్తా బెడ్ రూంలో ఉంది. హాల్లో నుంచి మంటలు చెలరేగి దట్టంగా వ్యాపించాయి. నమయూన్ బయటకు వచ్చే లోపే సగానికి పైగా ఇల్లు కాలిపోయింది. 
 
అయితే వీరిద్దరు ఏ మాత్రం భాదపడలేదు. ఆందోళన చెందలేదు. తగలబడుతున్న ఇంటి ముందు నిలబడి ఓ సెల్ఫీ తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. దానికింద మా ఇళ్ళు కాలిపోయిందంటూ ఓ కామెంట్ పెట్టారు. దీంతో ఆ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. గంటలోనే 10 లక్షల మంది ఆ ఫోటోను చూసి రకరకాల కామెంట్స్ పెట్టారు. కొంతమంది తమాషా దంపతులని, మరికొందరైతే విచిత్రపు మనుషులని, ఇంకొందరైతే ఇన్సూరెన్స్ కోసం ఇలా చేశారంటూ మెసేజ్‌లు పెట్టారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments