Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెద్దనోట్ల రద్దు... 12 వేల ఎకరాలు కొన్న శశికళ?

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 వేల కోట్ల పన్ను ఎగవేతతో దేశంలోనే మొదటగా ఉన్నారు జైలు జీవితాన్ని అనుభవిస్తున్న శశికళ. కర్ణాటకలోని పరప్పణ జైలులో ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధిక

పెద్దనోట్ల రద్దు... 12 వేల ఎకరాలు కొన్న శశికళ?
, మంగళవారం, 16 జనవరి 2018 (22:03 IST)
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 వేల కోట్ల పన్ను ఎగవేతతో దేశంలోనే మొదటగా ఉన్నారు జైలు జీవితాన్ని అనుభవిస్తున్న శశికళ. కర్ణాటకలోని పరప్పణ జైలులో ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత నెలరోజుల నుంచి నిరంతరాయంగా ఐటీ దాడులను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఐటీ అధికారులు 5 వేల కోట్ల రూపాయలకుపైగా పన్ను ఎగవేసినట్లు గుర్తించారు.
 
అంతేకాదు పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో తమిళనాడులో 12 వేల ఎకరాల భూమిని శశికళ కొన్నట్లు గుర్తించారు. 80కి పైగా దొంగ కంపెనీలను సృష్టించి కోట్ల రూపాయలు పన్ను ఎగవేసినట్లు అంచనాకు వచ్చారు. అంతేకాదు లెక్కల్లోకి రాని ఆస్తులు, ఇతర కంపెనీల్లో శశికళ పెట్టుబడులు పెట్టడాన్ని కూడా గుర్తించారు ఐటీ అధికారులు. 
 
శశికళ ఇంటితో పాటు ఆమె బంధువులు ప్రధానంగా వదిన ఇళవరసి, ఆమె కుమారుడు జయటివి సీఈఓ వివేక్, అతని సోదరి క్రిష్ణప్రియ, షకీల, జయలలిత సహాయకుడు పూంగుండ్రన్, శశికళ సోదరుడు దివాకరన్, అల్లుడు దినకరన్ నివాసాలతో పాటు కార్యాలయాలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతతో శశికళ మాత్రమే మొదటిది అంటున్నారు ఐటీ అధికారులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనవడు దేవాన్ష్‌తో తాతయ్య బాలయ్య కుంగ్‌ఫూ, ఎడ్లబండిపై షికారు (వీడియో)