Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనవడు దేవాన్ష్‌తో తాతయ్య బాలయ్య కుంగ్‌ఫూ, ఎడ్లబండిపై షికారు (వీడియో)

సంక్రాంతి వేడుకలను నందమూరి బాలక్రిష్ణ చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జరుపుకున్నారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లి కావడంతో సకుటుంబ సపరివారసమేతంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతి యేడాది చంద్రబాబు నాయుడు సంక్రాంతి రోజు తన తల్లిదండ్రు

Advertiesment
మనవడు దేవాన్ష్‌తో తాతయ్య బాలయ్య కుంగ్‌ఫూ, ఎడ్లబండిపై షికారు (వీడియో)
, మంగళవారం, 16 జనవరి 2018 (21:40 IST)
సంక్రాంతి వేడుకలను నందమూరి బాలక్రిష్ణ చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జరుపుకున్నారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లి కావడంతో సకుటుంబ సపరివారసమేతంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతి యేడాది చంద్రబాబు నాయుడు సంక్రాంతి రోజు తన తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూరానాయుడులకు నివాళులు అర్పిస్తుంటారు. ఈ యేడాది కూడా కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తన స్వగ్రామంలోని పెద్ద గంగమ్మకు పూజలు చేసి ఆ తరువాత నాగాలమ్మకు కూడా పూజలు నిర్వహించారు.
 
నాగాలమ్మ వద్ద పూజలు చేసిన తరువాత బాలక్రిష్ణ దేవాన్ష్‌ను ఎత్తుకునేందుకు చేతులు పైకెత్తాడు. అయితే దేవాన్ష్ తాత దగ్గరకు రాకుండా తండ్రి నారా లోకేష్‌ దగ్గరే ఉండిపోయాడు. దీంతో బాలక్రిష్ణ తమాషాగా మనువడి పొట్టపై బాక్సింగ్ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేశాడు. మనువడితో బాలక్రిష్ణ ఆడుతున్న ఆటలను ఆసక్తిగా తిలకించారు నారావారిపల్లి గ్రామస్తులు. 
 
ఇక అంతకుముందు నారా బ్రాహ్మణి తన కుమారుడిని తీసుకుని ఎడ్ల బండిపై తిరిగారు. మొత్తమ్మీద చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటా... నటుడు సూర్య