Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్య'బాబోయ్'... బాలయ్యకు ఇలా.. పవన్‌కు అలానా? ఏంటిది?

వెనుకటికి రిక్షావోడు సినిమాలో విలన్ అంటాడు.. "అధికారం మన చేతిలో ఉంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ కూడా చెప్పే చేస్తార్రా" అని తన పిఏతో.. ప్రస్తుత సినీ పరిశ్రమ పరిస్థితి కూడా దానికి భిన్నంగా ఏమీ లేదని చాలా మంది బాహాటంగానే చర్చించుకుంటున్నారు. విషయానికి వస్

Advertiesment
అయ్య'బాబోయ్'... బాలయ్యకు ఇలా.. పవన్‌కు అలానా? ఏంటిది?
, శుక్రవారం, 12 జనవరి 2018 (15:46 IST)
వెనుకటికి రిక్షావోడు సినిమాలో విలన్ అంటాడు.. "అధికారం మన చేతిలో ఉంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ కూడా చెప్పే చేస్తార్రా" అని తన పిఏతో.. ప్రస్తుత సినీ పరిశ్రమ పరిస్థితి కూడా దానికి భిన్నంగా ఏమీ లేదని చాలా మంది బాహాటంగానే చర్చించుకుంటున్నారు. విషయానికి వస్తే... సినిమా రివ్యూల పేరిట ఆ సినిమా కథను బయటపెట్టేయకండి.. దాని వలన సినిమా చూడాలనుకునే సగటు ప్రేక్షకుడు ముందే కథ తెలిసిపోవడంతో సినిమా చూడాలనే ఆసక్తిని వదిలేసుకోవడంతో సినీ పరిశ్రమ చచ్చిపోతోందని చాలామంది పెద్దలు ఎన్నో సార్లు చెప్పినా ఎవ్వరూ వినిపించుకున్న దాఖలాలైతే ఎక్కడా కనబడలేదు. 
 
కానీ ఈ సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాలలో పవన్ కళ్యాణ్ సినిమా గురించి రివ్యూల పేరిట దాదాపు 75 శాతం కథను ప్రేక్షకుల ముందు పెట్టేసిన సమీక్షలు.. తాజాగా ఈ రోజు విడుదలైన బాలయ్య బాబు సినిమాకు మాత్రం మొదటి భాగం సమీక్షతో ఆపేయడం చూస్తూంటే... చివరికి ఇటువంటి చిన్నపాటి వాటికి కూడా అధికార పక్షంలో ఉండాలి కాబోలు అన్నట్లుంది.
 
మొన్నటికి మొన్న చారిత్రాత్మక సినిమా పేరిట గౌతమీపుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను రాయితీ ఇచ్చి మరో చారిత్రాత్మక సినిమా రుద్రమదేవికి ఇవ్వలేదని గుణశేఖర్ బాధపడటమూ చూసాం.. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నంది పురస్కారాలను కూడా కేవలం బాలయ్య బాబు సినిమాలకు మాత్రమేనా అంటూ.. పోసాని లాంటి చాలా మంది వ్యతిరేకించడం కూడా చూస్తూనే ఉన్నాము. 
 
వీటన్నింటికీ తోడుగా.. బాలయ్య బాబు సినిమాకు మాత్రం మరే హీరో సినిమాకు లేని విధంగా ఎన్ని ప్రదర్శనలైనా వేసుకోవచ్చంటూ ఇచ్చిన అనుమతైతే అసలు విడ్డూరం కంటే కాస్త ఎక్కువనే చెప్పవచ్చు. చూడబోతే... చివరికి రాష్ట్రంలో ఏం చేయాలన్నా.. అధికార పార్టీ అండదండలు తప్పనిసరి అనే పరిస్థితి వస్తోందేమో మరి.. చూద్దాం ఆ సినిమా కూడా...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ తిక్కకు లెక్కుందంటున్న వెంకటేష్ (వీడియో)