Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పచ్చనివి తిందాం... పచ్చగా ఉందాం....

ప్రకాశవంతమైన పసుపు రంగు కంటికి ఆహ్లాదాన్నే కాదు, మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆశావాదాన్ని పెంపొందించే శక్తివంతమైన రంగుగా దీన్ని కొనియాడుతుంటారు. అన్నింటికన్నా పసుపు రంగు ఆహారం చర్మ సంరక్షణకు ఎంతో మేలు. చలికాలంలోను, వేసవి కాలంలోను చర్మం వడిలిపోయి, ఎ

Advertiesment
పచ్చనివి తిందాం... పచ్చగా ఉందాం....
, గురువారం, 11 జనవరి 2018 (19:51 IST)
ప్రకాశవంతమైన పసుపు రంగు కంటికి ఆహ్లాదాన్నే కాదు, మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆశావాదాన్ని పెంపొందించే శక్తివంతమైన రంగుగా దీన్ని కొనియాడుతుంటారు. అన్నింటికన్నా పసుపు రంగు ఆహారం చర్మ సంరక్షణకు ఎంతో మేలు. చలికాలంలోను, వేసవి కాలంలోను చర్మం వడిలిపోయి, ఎండిపోయినట్లవుతుంది. అందుకేనేమో గుమ్మడి, మొక్కజొన్న, నిమ్మ, అరటి, పైనాపిల్, మామిడి, పనస వంటి పసుపు రంగు కూరగాయలు, పండ్లన్నీ ఆ రెండు కాలాల్లోనే ఎక్కువగా వస్తాయి. 
 
ఇవి ముఖం మీద మొటిమలు రాకుండాను, చర్మ సౌందర్యానికి కూడా దోహదపడతాయి. ముఖ్యంగా పసుపు రంగులో విటమిన్ ఎ1 శాతం చాలా ఎక్కువ. ఇది చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. అందువల్లే వృద్ధాప్యం మీదపడకుండానూ కాలుష్యం ఒత్తిడి... వంటివాటి కారణంగా చర్మం పాడవకుండా ఉండేందుకు రాసుకునే క్రీముల కన్నా పసుపు రంగు పండ్లను ఆహారంగా తీసుకోవడమే ఉత్తమం అంటున్నారు చర్మ వైద్య నిపుణులు. 
 
పసుపు రంగు కాలీప్లవర్ లోని పోషకాలు కంటి చూపుని చర్మ సౌందర్యాన్నీ మెరుగుపరుస్తాయి. అలాగే వంకాయ, క్యాబేజి, పుట్టగొడుగులు, పచ్చిమిర్చి, ముల్లంగి... ఇలా మరెన్నో కూరగాయలు కూడా పసుపు రంగులో లభ్యమవుతూ అందర్ని ఆకట్టుకుంటున్నాయి. ఎరుపు రంగు ఆపిల్స్‌తో పోలిస్తే పసుపు రంగు వాటిల్లో సహజమైన చక్కెర, పీచు ఎక్కువ. అందువల్ల దీన్నీ మద్యాహ్నం స్నాక్స్‌గా తీసుకుంటే మంచిది. పసుపు రంగు ఆపిల్ శరీరంలోని టాక్సిన్లని తొలగిస్తుంది.
 
అలాగే పసుపు రంగు అంజీర్‌లో పోటాషియం ఎక్కువగా ఉండి, బీపీ రోగులకీ మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యూధులున్న వాళ్ళకి ఇది ఎంతో మేలు. పసుపు రంగు పండ్లు, కూరగాయల్లో బయోప్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. అవి అద్భుతమైన యాంటిఆక్సిడెంట్లుగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వీటిల్లో ఖనిజాలు, విటమిన్లు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఇవన్నీ కలిసి గుండె ఆరోగ్యానికి కంటిచూపు మెరుగవడానికి దంతసిరికి ఎముక బలానికి పుండ్ల నివారణకి తోడ్పడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలబంద జ్యూస్‌తో గ్రీన్ టీ తాగండి.. బరువు తగ్గండి..