Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవి గుండె ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకుంటాయి... అందుకే...

మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసుల్లో మెంతులు కూడా వుంటాయి. మెంతి ఆకులు ఆకుకూరగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజల

Advertiesment
అవి గుండె ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకుంటాయి... అందుకే...
, శనివారం, 30 డిశెంబరు 2017 (14:20 IST)
మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసుల్లో మెంతులు కూడా వుంటాయి. మెంతి ఆకులు ఆకుకూరగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడటం తెలిసిందే. మెంతులలో ఔషధ గుణాలనున్నాయని చాలామందికి తెలుసు. గుండెకు, మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయి. 
 
మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు,చేదు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.
 
మెంతి ఆకుల ఔషధ గుణాలు ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం. పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెంచాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. కామెర్లు వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌‌తో బాధపడుతున్న వారికి ఆకులను దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు.  
 
కంటి నుండి అదే పనిగా నీరు కారుతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రిపూట కంటికి కట్టాలి. వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషథం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖం మీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండేచోట బాగా అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పును ఇలా కూడా వాడొచ్చు..