ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే...?

ఉలవల్ని పశువులకు గుగ్గిళ్ళుగా పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మనం. కాని వాటికి అమోఘమైన ఔషధ గుణాలున్నాయి. ఉలవలు తెలుపు, ఎరుపు, నలుపు... ఇలా మూడు రంగుల్లో దొరుకుతాయి. వీటిల్లో నల్ల ఉలవలు ఎక్కువ శ్రేష్టం అని శాస్త్రం. మిగత రెండు కూడా వాడుకోవ

గురువారం, 4 జనవరి 2018 (19:23 IST)
ఉలవల్ని పశువులకు గుగ్గిళ్ళుగా పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మనం. కాని వాటికి అమోఘమైన ఔషధ గుణాలున్నాయి. ఉలవలు తెలుపు, ఎరుపు, నలుపు... ఇలా మూడు రంగుల్లో దొరుకుతాయి. వీటిల్లో నల్ల ఉలవలు ఎక్కువ శ్రేష్టం అని శాస్త్రం. మిగత రెండు కూడా వాడుకోవచ్చు. అవి కూడా మంచి ఫలితాలిస్తాయి. ఉలవలు శరిరానికి బాగా వేడిని కలిగిస్తాయి. 
 
కానీ వాతాన్ని, జలుబుని, భారాన్నితగ్గించి, శరీరాన్ని తేలికపరుస్తాయి. ఊపిరికుట్టు నొప్పిని తగ్గిస్తాయి. మూత్రం ఫ్రీగా నడిచేలా చేస్తాయి. మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను కరిగించడానికి సహాయపడతాయి. ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన  రసంతో ఉలవచారు కాచుకుని తాగితే రాళ్ళు త్వరగా కరుగుతాయి. 
 
స్త్రీల బహిష్టుకు సంబంధించిన వ్యాధులన్నింటి మీదా ఉలవలు ప్రభావం చూపిస్తాయి. ప్రసవించిన స్త్రీల మైలరక్తం పూర్తిగా బయటకు పోవడానికి ఉలవలు బాగా తోడ్పడతాయి. బహిష్టు అయినప్పుడు ఉలవలు తీసుకుంటే ఋతురక్తం బాగా అవుతుంది. ఇలా ఋతురక్తం సరిగా కానివారు మాత్రమే ఉలవలు తీసుకోవాలి. ఉలవల్ని చారులాగా కాచుకొని తీసుకోవడం వల్ల అనేక రకమైన వ్యాధులను నివారించుకోవచ్చు. ఉలవల్ని ఉడికించి గుగ్గిళ్ళుగా తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగింవచవచ్చు. దీని వలన శరీరంలో అధిక బరువు తగ్గి, దృఢత్వం ఏర్పడుతుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అందంగా వుండేందుకు ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే....?