Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్య "జై సింహా' ... 16 వరకు ప్రత్యేక షోలకు అనుమతి

నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుగగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.

Advertiesment
బాలయ్య
, శుక్రవారం, 12 జనవరి 2018 (08:40 IST)
నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుగగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. 
 
ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ‘జై సింహా’ సినిమాను 24X7 ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
అయితే, ఈ స్పెషల్ షోలను అర్థరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు నిర్వహించాలని, ప్రేక్షకుల రద్దీ, బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంగోపాల్ వర్మ కొత్త చిత్రం 'GST'.. ఉలిక్కిపడుతున్న టాలీవుడ్