Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ఆర్మీ తీరుపై అమరవీరుల సైనికుల కుటుంబాల ఆగ్రహం?

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (13:06 IST)
ఈ నెల15వ తేదీన లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ వద్ద భారత్ - చైనా దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో భారత్ వైపు నుంచి 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. అలాగే, చైనా తరపున కూడా అనేకమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కానీ, కమాండర్ ఆఫరీసర్, మరికొంతమంది మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్టు చైనా ప్రకటించింది. మరి కొంత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఆ ఘర్షణలో చైనా ఇప్పటికీ మృతుల వివరాలు తెలపకపోవడం గమనార్హం. దీంతో చైనా ప్రభుత్వ తీరుపై ఆ సైనికుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
   
చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వ్యవహరిస్తోన్న ఈ తీరుపై మృతుల కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నారని అమెరికా కేంద్రంగా నడిచే బ్రీట్‌బార్ట్ న్యూస్ తెలిపింది. వెయిబోతో పాటు చైనాకు చెందిన పలు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా సైనికుల కుటుంబ సభ్యులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నట్లు బ్రీట్‌బార్ట్‌ న్యూస్‌ ఎడిటర్‌ ఓ కథనంలో పేర్కొన్నారు. 
 
జూన్‌ 15న జరిగిన ఘర్షణలో 20 మంది తమ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత్‌ ప్రకటించింది. అదే సమయంలో చైనా వైపున కూడా భారీగా ప్రాణ నష్టం జరిగిందని చెప్పింది. చైనా మాత్రం ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేకపోతోంది.
 
ఇప్పటివరకు మృతి చెందిన అతి కొద్ది మంది ఆఫీసర్ల పేర్లే ప్రకటించింది. ఈ విషయంపై మృతి చెందిన చైనా సైనికుల కుటుంబాలు సామాజిక  మాధ్యమాల ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని ఆ కథనంలో పేర్కొని చైనా తీరుని బ్రీట్‌బార్ట్ న్యూస్ ఎండగట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments