Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌‌కు బ్రిటన్‌‌ షాక్.. దేశం వదిలిపోవాల్సిందే

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (19:22 IST)
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ బ్రిటన్‌ను వదిలిపోవాల్సిందేనని ఆ దేశం తేల్చేసింది. వీసా గడువు పొడగింపు కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును తిరస్కరించడమే కాకుండా.. దేశం విచిడి వెళ్లాల్సిందే అని స్పష్టం చేసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ (71)పై పాకిస్థాన్‌లో రెండు అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. అల్ అజీజియా మిల్స్ కేసులో ఆయనకు కోర్టు 2018లో ఏడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 
 
ఈ క్రమంలో ఆయన కొద్ది రోజులు లాహోర్ జైలులో జైలు జీవితం గడిపారు. తర్వాత వైద్య చికిత్స కోసం బెయిల్ కావాలంటూ.. నవాజ్ షరీఫ్ కోర్టు ఆశ్రయించారు. దీంతో లాహోర్ కోర్టు ఆయనకు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది.
 
బెయిల్ రావడంతో చికిత్స కోసం 2019లో ఇంగ్లాండ్‌కు వెళ్లిన షరీఫ్.. వైద్యం పేరుతో వీసా గడువును పెంచుకుంటూ అక్కడే మకాం వేశారు. కాగా.. తాజాగా మరోసారి వీసా గడువు పొడగింపును కోరుతూ ఆయన చేసిన దరఖాస్తును యూకే హోం ఆఫీస్ తిరస్కరించింది. అవినీతి కేసుల్లో శిక్ష పడ్డ షరీఫ్.
 
నిబంధనలకు విరుద్ధంగా తమ దేశంలో ఉంటున్నారని పేర్కొంది. అంతేకాకుండా దేశం విడిచి వెళ్లాల్సిందిగా షరీఫ్‌ను ఆదేశించింది. యూకే హోం ఆఫీస్ ఇచ్చిన ఆదేశాలపై షరీఫ్ అధికార ప్రతినిధి స్పందించారు. దీనిపై బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments