Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ఓకే

Advertiesment
Microsoft
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇపుడు మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ కేంద్రాన్ని రూ.1500 కోట్ల వ్యయంతో నెలకొల్పనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. 
 
ఈ మేరకు ప్రభుత్వంతో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
 
ఇదిలావుంటే, మరోమూడు ఐటీ కంపెనీలు కూడా ఇదే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం 30 మెగావాట్లువుండగా, 2023 నాటికి ఈ సామర్థ్యం 96 మెగావాట్లకు పెరుగుతుందని కన్సల్టింగ్ సేవల సంస్థ జేఎల్ఎల్ అంచనా వేసింది.
 
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యయాలు తక్కువగా ఉండటానికి తోడు ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత ఎక్కువగా ఉండడం వల్లే ఇక్కడ డేటా కేంద్రాల ఏర్పాటుకు కంపెనీలు ముందుకొస్తున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు 'వైఎస్ఆర్ కాపు నేస్తం' కింద రూ.490.86 కోట్ల పంపిణీ