Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏడేళ్ళ బాలుడు కామవాంఛ తీర్చలేదనీ మృగంగా మారిన యువకుడు

Advertiesment
ఏడేళ్ళ బాలుడు కామవాంఛ తీర్చలేదనీ మృగంగా మారిన యువకుడు
, గురువారం, 22 జులై 2021 (08:28 IST)
వివిధ రకాల వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు తాగిన మైకంలో తన కామవాంఛ తీర్చలేదన్న అక్కసుతో ఏడేళ్ల బాలుడుని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ ఏరియాలో జరుగగా, ఈ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 
 
పోలీసుల కథనం మేరకు, బాలాపూర్‌ మండల పరిధిలోని వాదీ ఏ ముస్తఫా కాలనీకి చెందిన ఒమర్‌ బిన్‌ హసన్‌ (25) చెడు అలవాట్లకు బానిసై జులాయిగా తిరిగేవాడు. పేద కుటుంబం, ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లిదండ్రులు అతడి వివాహం చేయలేకపోయారు. గంజాయి మత్తులో ఉండే నిందితుడికి లైంగిక కోరికలు పెరగడంతో ఆ కోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నించసాగాడు. 
 
ఈ క్రమంలోనే 2019, మే 8వ తేదీన రాత్రి సుమారు 9 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఏడేండ్ల బాలుడు చాక్లెట్‌ కొనుగోలు కోసం వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో ఉన్న దుకాణానికి వచ్చాడు. ఒమర్‌ బిన్‌ హసన్‌ ఆ బాలుడిని గమనించాడు. బాలుడి వద్దకు వెళ్లి.. మాయమాటలు చెప్పాడు. మాటల్లో పెట్టి ప్రహరీ నిర్మించి ఉన్న స్థలంలోకి తీసుకెళ్లాడు.
 
అక్కడ బాలుడిపై వికృత చేష్టలతో లైంగిక దాడికి దిగాడు. బాలుడు సహకరించకపోవడంతోపాటు కేకలు వేస్తూ ఏడ్చాడు. విషయం బయటకు తెలుస్తుందన్న భయంతో బాలుడి చేతులు, కాళ్లు పట్టుకొని నిందితుడు బండకు కొట్టాడు. దీంతో బాలుడి తలకు బలంగా దెబ్బ తగలడంతో మరణించాడు. 
 
బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన బాలాపూర్‌ అప్పటి ఇన్‌స్పెక్టర్‌ సైదులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటన 2019, మే 8వ తేదీన బాలాపూర్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు.. జరినామా విధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాపం బుగ్గన! ఢిల్లీలో పడిగాపులు పడుతున్న ఆర్థిక మంత్రి!