Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్ క్లింటన్‌తో సంబంధం.. మోనికా వయస్సు 22.. ఏం పర్లేదు.. హిల్లరీ

ప్రపంచాన్ని ప్రస్తుతం మీ టూ ఉద్యమం షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రముఖులందరూ మీ టూ ఉద్యమానికి మద్దతు తెలిపారు.

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (15:44 IST)
ప్రపంచాన్ని ప్రస్తుతం మీ టూ ఉద్యమం షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రముఖులందరూ మీ టూ ఉద్యమానికి మద్దతు తెలిపారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు, అప్పట్లో వైట్ హౌస్ ఉద్యోగి మోనికా లూయిన్ స్కీకి మధ్య ఉన్న అఫైర్ గురించి నోరు విప్పారు. అప్పట్లో ఈ అఫైర్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషనల్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా మీటూ ఉద్యమం నేపథ్యలో ఆ అఫైర్ మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. ఆ అఫైర్‌కు, అధికార దుర్వినియోగానికి ఎలాంటి సంబంధం లేదని తన భర్తను వెనకేసుకుని వచ్చారు. ఈ అఫైర్ కారణంగా అధ్యక్ష పదవికి తన భర్త రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. 
 
మోనికాతో తన అఫైర్‌కు సంబంధించి అబద్ధాలను చెప్పిన బిల్ క్లింటన్ అప్పట్లోనే తన పదవి నుంచి దిగిపోతే బాగుండేదని న్యూయార్క్ సెనేటర్ గిల్లిబ్రాండ్ చేసిన వ్యాఖ్యలపై హిల్లరీ క్లింటన్ స్పందించారు. ఆ అఫైర్ కారణంగా పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం లేదన్నారు. ఆ ఘటన జరిగిన సమయంలో మోనికా వయసు 22 ఏళ్లని... అప్పటికే ఆమె వయోజనురాలు (అడల్ట్) అని చెప్పారు.
 
మోనికాతో అఫైర్ వెలుగు చూసిన తర్వాత 1999లో జరిగిన సెనెట్ ట్రయల్‌లో బిల్ క్లింటన్ గట్టెక్కిన సంగతి తెలిసిందే. ఆయనను తొలగించడానికి సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ రావాలి. కానీ కావాల్సినంత మెజార్టీకి కొంచెం తక్కువ రావడంతో బిల్ క్లింటన్ గట్టెక్కారు.

సంబంధిత వార్తలు

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments