Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డొనాల్డ్ ట్రంప్‌కి తర్వాత ఇవాంకానే ప్రెసిడెంట్: మలియాకు సపోర్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామా ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. మలియా గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. మలియా స్మోక్ చేయడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో సీన్లోకి ప్రస్తుత డొన

డొనాల్డ్ ట్రంప్‌కి తర్వాత ఇవాంకానే ప్రెసిడెంట్: మలియాకు సపోర్ట్
, సోమవారం, 27 నవంబరు 2017 (15:18 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామా ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. మలియా గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. మలియా స్మోక్ చేయడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో సీన్లోకి ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ వచ్చారు.

గతంలో బాయ్‌ఫ్రెండ్‌తో ముద్దు సన్నివేశంలో సోషల్ మీడియాకు చిక్కిన మలియా.. సిగెరెట్ కాలుస్తూ రింగులు రింగులుగా పొగ ఊదింది. మలియా ఇలా పొగ వదలడాన్ని స్నేహితులు వీడియోలో బంధించి నెట్లో పెట్టేశారు. ఆపై అదీ కాస్త వైరల్ అయ్యింది. 
 
ప్రస్తుతం మలియా హార్వర్డ్ వర్శిటీ చదువుతోంది. యుక్త వయసులో పిల్లలు ఇలాంటి చర్యలకు దిగడం మామూలేనని నెటిజన్స్ మలియాకు మద్దతు పలికారు. మరికొందరు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మలియాకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మద్దతుగా నిలిచారు. మలియా ఒబామా వ్యక్తిగత వ్యవహారమని, దాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేయడం తగదని స్పష్టం చేశారు. 
 
అటు మలియా ఒబామాకు మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ సైతం మద్దతిచ్చారు. ఓ కాలేజీ విద్యార్థినిగా.. అమెరికా యువతిగా ఆమె వ్యక్తిగత జీవితానికి హక్కు ఉంటుందని..  దాన్ని పబ్లిక్ చేయకూడదంటూ చెల్సియా ట్వీట్ చేశారు. దీంతో మలియాపై విమర్శలు గుప్పించే నెటిజన్స్ నోటిపై వేలుపెట్టారు. మలియా స్మోకింగ్‌పై మీడియాకు అనవసరమని చెల్సియా, ఇవాంక చెప్పడంతో మీడియా కూడా కాస్త తగ్గింది.
 
ఇకపోతే.. డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ రాజకీయాల్లోకి రానున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. తండ్రి బాటలో బిజినెస్, పాలిటిక్స్ రంగాల్లో రాణించాలని భావిస్తున్నారు. అంతేగాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇవాంకా బరిలోకి దిగే ఛాన్సు కూడా వుందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే డొనాల్డ్‌ ట్రంప్‌కు కీలక సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇవాంకా.. తదుపరి ఎన్నికల్లో రాణించే దిశగా సర్వం సిద్ధం చేసుకుంటున్నారని టాక్ వస్తోంది. అలాగే ఇవాంకా క్రేజ్‌ కూడా అమాంతం పెరిగిపోతుందని... ఇప్పటికే అమెరికాలో ఆమెకు మద్దతు పలికే వారి సంఖ్య పెరిగిందని.. ప్రపంచ దేశాల్లోనూ ఆమె పట్ల సదాభిప్రాయం వుందని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ హేళనగా మాట్లాడారట... అందుకే గేట్లు మూసేశారట పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి