Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ టూకు మిషెల్, మెలానియా మద్దతు.. ప్రపంచంలో ఆమే ఎక్కువ?

ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో.. లైంగిక దాడులను ఎదుర్కొన్న మహిళలు తమ చేదు అనుభవాలను నిర్భయంగా తెలియజేస్తున్నారు.

మీ టూకు మిషెల్, మెలానియా మద్దతు.. ప్రపంచంలో ఆమే ఎక్కువ?
, శుక్రవారం, 12 అక్టోబరు 2018 (18:25 IST)
ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో.. లైంగిక దాడులను ఎదుర్కొన్న మహిళలు తమ చేదు అనుభవాలను నిర్భయంగా తెలియజేస్తున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ కూడా మీటూ ఉద్యమానికి మద్దతు పలికారు. మహిళలంతా ధైర్యంగా ముందుకు రావాలని... తద్వారా రాబోయే తరాలకు మంచి బాటను వేయాలని సూచించారు. 
 
గ్లోబల్ గర్ల్ అలయెన్స్‌ను ప్రారంభించిన సందర్భంగా మిషెల్ మాట్లాడుతూ.. మార్పుతో ఏదైనా సాధ్యమేనని చెప్పారు. మార్పు అనేది అంత సులభంగా రాదని చెప్పారు. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఉండాలని మహిళలు కోరుకుంటున్నారని, మహిళలు, బాలికల విషయంలో చేయాల్సింది ఇంకా చాలా ఉందని మిషెల్ తెలిపారు.
 
మరోవైపు ప్రపంచంలో తానే అధికంగా వేధింపులకు గురవుతున్నానని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ చెప్పారు. ప్రతి విషయంలో తాను అత్యుత్తమంగా ఉండటానికి ప్రయత్నిస్తాననీ, అయితే దానిని సోషల్ మీడియాలో మరో రకంగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. తాను ధరించే దుస్తులపై నెట్టింట రచ్చ రచ్చ జరుగుతుందన్నారు. 
 
మెలానియా ఇటీవల కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్‌ హెల్మెట్‌ను ధరించి అక్కడి సఫారీ పార్కులో విహరించారు. ఈ బ్రిటిష్‌ టోపీని ధరించడం.. ఏళ్ల పాటు బ్రిటిష్‌ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తన వస్త్రధారణ గురించి కాకుండా తాను చేసిన పనుల గురించి మాట్లాడితే మంచిదని మెలానియా హితవు పలికారు. వస్త్రధారణపై జరుగుతున్న చర్చ పట్ల తాను తీవ్రమైన వేధింపులకు గురి అవుతున్నానని మెలానియా అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అరవింద సమేత' సినిమా చూసి పరారైన ఆరుగురు విద్యార్థులు.. ఎందుకు?