Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాజులు తొడుక్కోలేదు.. ఒకసారి చేస్తే పదిసార్లు దాడి చేస్తాం.. భారత్‌కు పాక్ వార్నింగ్

గాజులు తొడుక్కోలేదు.. ఒకసారి చేస్తే పదిసార్లు దాడి చేస్తాం.. భారత్‌కు పాక్ వార్నింగ్
, ఆదివారం, 14 అక్టోబరు 2018 (17:13 IST)
భారత్‌కు పాకిస్థాన్ గట్టివార్నింగ్ ఇచ్చింది. ఒకసారి దాడి చేస్తే పది సార్లు తిరిగి దాడిచేస్తామంటూ హెచ్చరికలు చేసింది. లండన్‌లో మీడియాతో ఆర్మీ చీఫ్ జనరల్ ఒమర్ జావేద్ బజ్వాతో కలిసి పాకిస్థాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాట్లాడుతూ, తమ భూభాగంపై భారత్ ఒక్కసారి సర్జికల్ దాడి చేస్తే, మేము 10 సార్లు భారత్‌లోకి చొరబడి అటువంటి దాడులనే చేసి మా సత్తా చాటుతాం అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు.
 
ఏదైనా సాహసం చేసేముందు పాకిస్థాన్ సైనిక బలగాన్ని, తమ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు. చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను తమ సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి వున్నామన్నారు. 
 
పాకిస్థాన్‌లో మీడియాకు స్వాతంత్ర్యం లేదని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, తమ దేశంలో ప్రసార మాధ్యమాల ప్రసారాలకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కావడం లేదనీ, వాటికి పూర్తి స్వాతంత్ర్యం ఉందని సమాధానమిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎంజే అక్బర్