Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎంజే అక్బర్

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖసహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన ఆఫ్రికా పర్యటనను ముగిచుకుని ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇక్కడి పరిస్థితులను తెల

Advertiesment
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎంజే అక్బర్
, ఆదివారం, 14 అక్టోబరు 2018 (15:31 IST)
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖసహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన ఆఫ్రికా పర్యటనను ముగిచుకుని ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇక్కడి పరిస్థితులను తెలుసుకుని ఆ తర్వాత పదవికి రాజీనామా చేశారు.
 
ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాకు తన రాజీనామాను పంపించిన ఆయన.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ కోసం సమయం కోరారు. ఈ అంశంపై ఆయ‌న త‌ర్వ‌లోనే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. 
 
అక్బర్ ఎడిటర్‌గా ఉన్న సమయంలో తమను వేధించాడంటూ ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కేబినెట్ నుంచి తప్పుకోవాల్సిందేనన్న ఒత్తిడి పెరిగింది. విదేశీ పర్యటన నుంచి రాగానే రాజీనామా చేస్తారని ఇంతకుముందే వార్తలు వచ్చాయి.
 
తాము ఎక్కడికి వెళ్లినా అక్బర్ ఉదంతంపైనే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఇతర మంత్రులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు అటు బీజేపీగానీ, ఇటు విదేశాంగ మంత్రి సుష్మాతోపాటు ఇతర ఏ మంత్రీ ఈ ఆరోపణలపై స్పందించలేదు. 
 
తన కెరీర్‌లో టెలీగ్రాఫ్, ఏషియన్ ఏజ్, ద సండే గార్డియన్‌లాంటి ప్రముఖ పత్రికలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన తనను వేధించారంటూ తొలిసారి ప్రియా రమణి అనే జర్నలిస్ట్ బయటపెట్టింది. ఆ తర్వాత పలువురు ఇతర మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ భార్య, కుమారుడిని కాల్చాను... జడ్జి సెక్యూరిటీగార్డు