Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ కామాంధుడుని మంత్రపదవి నుంచి తప్పించాలి : రోడ్డెక్కిన మహిళా లోకం

ఆ కామాంధుడుని మంత్రపదవి నుంచి తప్పించాలి : రోడ్డెక్కిన మహిళా లోకం
, ఆదివారం, 14 అక్టోబరు 2018 (10:15 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న ఎంజే అక్బర్‌ను తక్షణం కేబినెట్ నుంచి తొలగించాలంటూ వస్తున్న డిమాండ్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇందుకోసం మహిళా లోకం ఢిల్లీ రోడ్లపై కదంతొక్కింది. 
 
ఓ పత్రికకు ఎడిటర్‌గా పని చేసే సమయంలో ఎంజే అక్బర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా జర్నలిస్టు ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దీంతో ఆయన్ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ మహిళా పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారు.
 
ఇందుకోసం శనివారం ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. మీడియాహౌస్‌లు సహా అన్నిరకాల పని స్థలాల్లో మహిళల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలంటూ ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కార్పొరేషన్‌ (ఐడబ్ల్యూపీసీ) డిమాండ్‌ చేసింది. 
 
అక్బర్‌ ఆదివారం ఆఫ్రికా నుంచి భారత్‌కు రానున్నారు. ఆయన వివరణను బట్టి స్పందించాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, పలు కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పరిస్థితులపై తీరా తీస్తున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న తమఅధికారిని టాటామోటార్స్‌ సెలవుపై పంపించింది.
 
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ రెసిడెంట్‌ ఎడిటర్‌ శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. ప్రముఖ సినీ ఏజెంట్లు ముఖేశ్‌ ఛాబ్రా, విక్కీ సిదానాలపై నలుగురు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. 'హౌస్‌పుల్‌-4' షూటింగ్‌ నిలిచిపోవడంతో సాజిద్‌ తప్పుకున్నారు. డైరెక్టర్‌ కరీమ్‌ మొరానీ తనను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీసి, బెదిరిస్తున్నాడని ఓ నటి ఫిర్యాదు చేశారు. ఇలా దేశ వ్యాప్తంగా మీటూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌత్ ఇండియా స్టేట్స్ కంటే పాకిస్థాన్ బెట్టర్ : నవజ్యోత్ సింగ్ సిద్ధూ