Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ క్రికెటర్ నన్ను బెడ్‌పైకి బలవంతంగా నెట్టి.. నా మీదకు వచ్చాడు.. శ్రీపాద చిన్మయి తాజా ట్వీట్

Advertiesment
ఆ క్రికెటర్ నన్ను బెడ్‌పైకి బలవంతంగా నెట్టి.. నా మీదకు వచ్చాడు.. శ్రీపాద చిన్మయి తాజా ట్వీట్
, గురువారం, 11 అక్టోబరు 2018 (17:13 IST)
తమిళ గాయని శ్రీపాద చిన్మయి తాజాగా మరో ట్వీట్ చేసింది. ఇప్పటికే తమిళ సినీ గేయరచయిత పద్మశ్రీ వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసిన ఆమె ఇపుడు శ్రీలంక సీనియర్ క్రికెటర్ లసిత్ మలింగాపై ఇదే తరహా ఆరోపణలు చేసింది. 
 
ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ తనూశ్రీ - నానా పటేకర్ వ్యవహారం వెగులోకి వచ్చాక... మీటూ ఉద్యమం మరింత ఊపందుకుంది. నిజానికి మీటూ ఉద్యమానికి ఆరంభం నుంచి శ్రీపాద మద్దతు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో శ్రీపాద చేసిన పోస్ట్ ఇపుడు సంచలనంగా మారింది. ఆమె చేసిన పోస్ట్‌ వివరాలను పరిశీలిస్తే...
 
"కొన్నేళ్ల క్రితం నేను ముంబైలో ఉన్నప్పుడు, నేను ఉంటున్న హోటల్ దగ్గరే ఓ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నా. అది ఐపీఎల్ సీజన్ జరుగుతున్న సమయం. మా ఫ్రెండ్, నేను ముంబైలోని ఓ హోటల్‌లో దిగాం. ఓ శ్రీలంక క్రికెటర్ కూడా అదే హోటల్‌లో బస చేశాడు. నా ఫ్రెండ్ కనిపించకపోవడంతో ఆమె కోసం ఎదురుచూస్తుండగా ఆ క్రికెటర్ నన్ను పిలిచి.. మీ ఫ్రెండ్ నా రూంలో ఉందని చెప్పాడు. నేను ఆ క్రికెటర్ రూమ్‌కి వెళ్లాను. నేను వెళ్లాను కానీ తను అక్కడ లేదు. నేను బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతను నన్ను బెడ్‌పైకి నెట్టి బలవంతంగా నా మీదకు వచ్చాడు. అతనిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు.
 
నా కళ్లు, నోరు మూసుకున్నాను కానీ అతడు నా మొహాన్ని వదల్లేదు. అప్పుడే హోటల్ స్టాఫ్ వచ్చి డోర్ కొట్టారు. అతను డోర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు. నేను వెంటనే వాష్ రూమ్‌లోకి పరిగెత్తాను. ఫేస్ వాష్ చేసుకుని హోటల్ స్టాఫ్ వెళ్లిన వెంటనే నేను ఆ గదిలో నుంచి వెళ్లిపోయాను. ఈ విషయం నేను బయటకు చెప్తే నువ్వు కావాలనే అతని రూమ్‌కి వెళ్లావు అని నన్ను అవమానిస్తారు. అతను ఫేమస్ క్రికెటర్ అయినందు వల్ల నువ్వు అతన్ని కావాలనుకున్నావు లేదంటే అతడిని బ్యాడ్ చేయాలనుకున్నావు అంటారు" అని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్వాలా గుత్తాకు పీవీ సింధు మద్దతు... వారందరికీ అభినందనలు...