విదేశాల్లో అరెస్టవుతున్న బిచ్చగాళ్లలో 90 శాతం మంది ఆ దేశీయులే...

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (09:31 IST)
ప్రపంచ వ్యాప్తంగా బిచ్చగాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. దీంతో అనేక దేశాలకు చెందిన పాలకులు బిచ్చగాళ్లను అరెస్టు చేస్తున్నారు. అలా అరెస్టవుతున్న యాచకుల్లో 90 శాతం మంది పాకిస్థాన్ పౌరులే కావడం గమనార్హం. ముఖ్యంగా, జేబుదొంగల్లో అత్యధికంగా పాకిస్థాన్ జాతీయులు ఉన్నట్టు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వమే వెల్లడించడం గమనార్హం. 
 
విదేశాల్లో పాకిస్థానీలకు సంబంధించి అక్కడి సెనే‌ట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ తెలిపారు. విదేశాల్లో అరెస్టవుతున్న వారిలో తొంబై శాతం మంది తమ దేశానికి చెందినవారే ఉన్నట్లు తెలిపారు.
 
ఇందులో ఎక్కువమంది సౌదీ, ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లేందుకు టూరిస్ట్ వీసాను ఉపయోగించుకుంటున్నట్లుగా తెలిపారు. వివిధ దేశాల్లోని పవిత్రస్థలాల్లో అరెస్టవుతున్న జేబుదొంగల్లోను పాక్ జాతీయులే అధికమని తెలిపారు. పశ్చిమాసియా దేశాలతో పాటు ఇటీవలి కాలంలో జపాన్ కూడా పాక్ జేబుదొంగలకు గమ్యంగా మారింది. 
 
సౌదీలో దాదాపు 30 లక్షలు, యూఏఈలో దాదాపు 15 లక్షలు, ఖతార్‌లో 2 లక్షల మంది పాకిస్థానీలు ఉన్నారు. ఇటీవల తమ దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న యాచకుల సంఖ్య భారీగా ఉందని నివేదిక తెలిపింది. యాచకుల సంఖ్య తమ దేశానికి పెరగడం పట్ల సౌదీ, ఇరాక్ వంటి దేశాలు పాకిస్థాన్‌కు హెచ్చరికలు కూడా జారీ చేశాయని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ గుర్తుగా రాజా సాబ్ స్పెషల్ పోస్టర్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments