Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ క్రికెటర్లకు నోరూరించే వంటకాలు... డైట్ చార్ట్‌లో మటన్ కర్రీ.. పులావ్...

Advertiesment
pak cricketers
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (09:16 IST)
భారత్‌లో జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల కోసం పాకిస్థాన్ జట్టు భాత్‌కు వచ్చింది. ఈ జట్టు నేరుగా హైదరాబాద్ నగరానికి చేరుకుంది. హైదరాబాద్ నగరంలోని ఓ నక్షత్ర హోటల్‌లో బస చేయగానే తమకు ఇష్టమైన ఆహారాన్ని లాంగించేశారు. పాక్ జట్టు రోజువారీ ప్రొటీన్ భోజనం కోసం చికెన్, మటన్, చేపలు వడ్డించనున్నారు. ముఖ్యంగా, డైట్ చార్ట్ ప్రకారం గ్రిల్డ్ లాంబ్ చొప్సు, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ వంటి వంటకాలను అందిస్తారు. అలాగే, మెనూలో ఉడికించిన బాస్మతి బియ్యం, బోలోగ్నీస్ సాస్‌తో కూడిన స్పాగెట్టి కూడా ఉంటుంది. 
 
ప్రస్తుతం ఈ జట్టు బంజారాహిల్స్‌లోని పార్క హయత్ హోటల్‌లో బస చేస్తుంది. శంషాబాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా హోటల్‌కు చేరుకున్నారు. వీరికి భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. ఈ వీడియోలను పాక్ క్రికెటర్లు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఇదిలావుంటే క్రీడాకారులకు ఆహారం ఎంతో ముఖ్యం. అందుకే పాక్ క్రికెటర్లు హైదరాబాద్‌లో బస చేసినంత కాలం అద్భుతమైన వంట రుచులను ఆరగించనున్నారు. శుక్రవారం న్యూజిలాండ్ జట్టుతో పాకిస్తాన్ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు వారు స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. 
 
ఇదిలావుంటే, పాక్ జట్టు రోజువారీ ప్రొటీన్ భోజనం కోసం చికెన్, మటన్, చేపలతో తయారు చేసిన వంటకాలను ఆరగిస్తున్నారు. పాక్ జట్టు దాదాపు రెండు వారాల పాటు హైదరాబాద్ నగరంలో ఉంటుంది. ఈ క్రమంలో వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని కడుపునిండా ఆరగించనున్నారు. 
 
మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్, గ్రిల్డ్ లాంబ్ చోప్స్, బోలోగ్నీస్ సాస్‌తో కూడిన స్పాగెట్టి, వెజ్ పులావ్, ఉడికించిన బాస్మతి బియ్యం తదితర వంటకాలను వారి డైట్ చార్ట్‌లో ఉంచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్ గంభీర్.. ప్రపంచ కప్ భారత్ గెలుస్తుంది..