Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్‌కోట్ వన్డేలో ఓడిపోయిన భారత్... ఆసీస్‌ను గెలిపించిన మ్యాక్స్‌వెల్

Advertiesment
ind vs aus
, బుధవారం, 27 సెప్టెంబరు 2023 (22:07 IST)
రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లను భారత్ గెలుచుకోగా, చివరి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపొందింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత 353 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 10 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 
 
భారత బ్యాట్స్‌మెన్లలో వాషింగ్టన్ సుందర్ 18, రోహిత్ శర్మ 81, విరాట్ కోహ్లీ 56, శ్రేయాస్ అయ్యర్ 48 చొప్పున పరుగులు చేశారు. ఈ నాలుగు వికెట్లను మ్యాక్స్‌వెల్ తీయడం గమనార్హం. ఇకపోతే, భారత్ స్వదేశంలో వచ్చే నెల ఐదో తేదీ నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్ కోసం సన్నద్ధం కానుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా జట్టుతోనే అక్టోబరు 8వ తేదీన చెన్నైలో తలపడనుంది. 


మూడో వన్డే మ్యాచ్ : ఆస్ట్రేలియా భారీ స్కోరు 
 
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. దీంతో భారత్ ముంగిట 353 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. 
 
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో మూడో వన్డే మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో కంగారులు ఉన్నారు. ఫలితంగా టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 
 
డేవిడ్ వార్నర్ 56, మిచెల్ మార్ష్‌లు తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన స్టీవెన్ స్మిత్ 74, మార్నస్ 72, క్యారీ అలెక్స్ క్యారీ 11, కుమ్మిన్స్ 19 చొప్పున పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
 
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ టీమిండియా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని బౌండరీల వర్షం కురిపించారు. మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. కుల్దీప్ బౌలింగ్‌లో మార్ష్ అవుటయ్యాడు. వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు.
 
వన్ డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా దూకుడుగా ఆడడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్మిత్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 74 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 40 ఓవర్లలో 5 వికెట్లకు 286 పరుగులు కాగా... 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసీస్‌తో మూడో వన్డే.. కోహ్లీ డ్యాన్స్.. వీడియో వైరల్