ఆస్ట్రేలియాతో ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మెరిసింది. భారత ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్ రెండో వన్డేలోనూ సెంచరీతో అదరగొట్టాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా సెంచరీతో చెలరేగిపోయాడు.
ఇందులో భాగంగా శ్రేయస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ చేశాడు. కెరీర్‌లో అతనికి ఇది మూడో శతకం. సెంచరీ తర్వాత ఫోర్ కొట్టిన అయ్యర్ ఆ తర్వాత 105 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆపై గిల్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. 92 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆపై కాసేపటికే అవుట్ అయ్యాడు.
ఇక భారత ఆటగాళ్లలో కెప్టెన్ కెఎల్ రాహుల్ 38 బంతుల్లో 52 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 72 పరుగులతో, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 31 పరుగులు సాధించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 399 పరుగులు చేసింది.
అయితే 400 పరుగుల భారీ లక్ష్యంతో క్రీజులోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభంలో వర్షం పడింది. ఫలితంగా డక్ వర్త లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. దీంతో ఆస్ట్రేలియా లక్ష్యం 317గా నిర్ణయించారు.