Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవోకేలో ఘోరం.. కొండ చరియలు విరిగిపడి 16 మంది దుర్మరణం

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (08:54 IST)
పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఘోరం జరిగింది. కొండ చరియలు విరిగిపడ్డాయి. వీటికింద చిక్కుకుని ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై ఈ కొండచరియలు విరిగిపడటంతో దారుణం జరిగింది. 
 
రోండూ నుంచి 18 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి ఓ బస్సు రావల్పిండి బయలుదేరింది. మార్గమధ్యంలో ఇద్దరు ప్రయాణికులు వారి గమ్యస్థానం వద్ద దిగిపోగా, మిగతా 16 మందితో బస్సు బయలుదేరింది. 
 
బస్సు గిల్గిత్-బాల్టిస్థాన్ మార్గంలో ప్రయాణిస్తుండగా బస్సుపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న 16 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. శనివారం రాత్రి నుంచి నిన్న ఉదయం వరకు సహాయక చర్యలు కొనసాగాయి.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments